వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు చివరిగా పూణేలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నది. వన్డే సిరీస్‌కు సంబంధించి 14 మంది సభ్యులు గల జట్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. టీ20 జట్టు సభ్యులైన ముగ్గురికి వన్డే జట్టులో చోటు లభించింది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని వన్డేల్లో కూడా టీ20 ప్లేయర్లను ఆడిస్తామని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఆయన సూచన […]
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు చివరిగా పూణేలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నది. వన్డే సిరీస్‌కు సంబంధించి 14 మంది సభ్యులు గల జట్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. టీ20 జట్టు సభ్యులైన ముగ్గురికి వన్డే జట్టులో చోటు లభించింది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని వన్డేల్లో కూడా టీ20 ప్లేయర్లను ఆడిస్తామని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఆయన సూచన మేరకు జాక్ బాల్, క్రిస్ జోర్డాన్, దావిద్ మలాన్‌ను వన్డే జట్టులో చేర్చారు. గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్‌ను వన్డే జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుతం అతడు ఈసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 23, 26, 28 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఇంగ్లాండ్ జట్టు :
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోనాథాన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, మాట్ పార్కిన్సన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్‌వుడ్, జాక్ బాల్, క్రిస్ జోర్డాన్, దావీద్ మలాన్