బెన్ స్టోక్స్ జెర్సీపై భారత డాక్టర్ పేరు
దిశ, స్పోర్ట్స్: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్, విండీస్ మధ్య జరుగుతున్న ‘రైజ్ ద బ్యాట్’ టెస్ట్ సిరీస్‌లో బెన్ స్టోక్స్ జెర్సీపై భారతీయ డాక్టర్ పేరు ఉండటం అందరినీ ఆకర్షిస్తున్నది. జట్టు ప్రాక్టీస్ సమయంలో ‘డాక్టర్ వికాస్ కుమార్’ అనే పేరు జెర్సీపై కనిపించింది. ఇందుకో కారణం ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వికాస్ కుమార్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని డార్లింగ్‌టన్ జాతీయ ఆరోగ్య సేవల (ఎన్‌హెచ్‌ఎస్) ట్రస్టు ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఐసీయూ విభాగంలో […]
దిశ, స్పోర్ట్స్: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్, విండీస్ మధ్య జరుగుతున్న ‘రైజ్ ద బ్యాట్’ టెస్ట్ సిరీస్‌లో బెన్ స్టోక్స్ జెర్సీపై భారతీయ డాక్టర్ పేరు ఉండటం అందరినీ ఆకర్షిస్తున్నది. జట్టు ప్రాక్టీస్ సమయంలో ‘డాక్టర్ వికాస్ కుమార్’ అనే పేరు జెర్సీపై కనిపించింది. ఇందుకో కారణం ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వికాస్ కుమార్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని డార్లింగ్‌టన్ జాతీయ ఆరోగ్య సేవల (ఎన్‌హెచ్‌ఎస్) ట్రస్టు ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఐసీయూ విభాగంలో ప్రత్యేక సేవల్లో నిమగ్నమయ్యారు. కొవిడ్‌పై యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది గౌరవార్థం ఆ దేశ టెస్టు క్రికెటర్ల జెర్సీలపై వాళ్ల పేర్లు ఉండేలా చూడాలని అక్కడి క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ‘రైజ్ ది బ్యాట్’ ప్రచారంలో భాగంగా ఇంగ్లండ్‌లోని క్రికెట్ క్లబ్‌లు నామినేట్ చేసిన వారిలో డాక్టర్ వికాస్ ఒకరు. ప్రచారంలో భాగంగా వికాస్ పేరుతో ఉన్న జెర్సీని బెన్ స్టోక్స్ ధరించాడు. స్టోక్స్ జెర్సీపై తన పేరు ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని వికాస్ చెప్పాడు. మూడేళ్ల కిత్రం ఢిల్లీలో జరిగిన భారత్-శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌కు వైద్యుడిగా ఆయన విధులు నిర్వర్తించాడు. వికాస్‌తోపాటు భారతీయులైన డాక్టర్ జమాస్ కైఖుష్రూ దస్తూర్, డాక్టర్ హరికృష్ణ షా, డాక్టర్ కృష్ణ అగధ పేర్లను కూడా పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు తమ జెర్సీలపై ధరించారు.