బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. ఇద్దరు విద్యార్థులు మృతి
దిశ, వెబ్‌డెస్క్ : ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.ఈ ఘటన తిరుపతిలోని చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మృతులు ఇంజినీరింగ్ చదువుతున్న అభిరామ్, అలేఖ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.