రాజధాని రైల్లో మంటలు
దిశ,వెబ్‌డెస్క్: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఘటన చోటు చేసుకుంది. మంటలను గుర్తించిన సిబ్బంది రైలును వెంటనే నిలిపివేశారు. సికింద్రబాద్ నుంచి బయలు దేరిన రాజధాని రైలు వికారాబాద్ జిల్లా నవాండ్గి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఇంజిన్ లో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కాగా సమాచారం అందుకున్న తాండూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి […]
దిశ,వెబ్‌డెస్క్: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఘటన చోటు చేసుకుంది. మంటలను గుర్తించిన సిబ్బంది రైలును వెంటనే నిలిపివేశారు. సికింద్రబాద్ నుంచి బయలు దేరిన రాజధాని రైలు వికారాబాద్ జిల్లా నవాండ్గి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఇంజిన్ లో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
కాగా సమాచారం అందుకున్న తాండూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మంటలను గమనించి ఇంజిన్ నుంచి భోగీలను సిబ్బంది వేరు చేశారని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో తెలిపారు. మరో ఇంజిన్‌ను ఉపయోగించి …ఆ రైలును గమ్యస్థానానికి చేరుస్తామని పేర్కొన్నారు.