దంతేవాడలో ఎన్‌కౌంటర్: తప్పించుకున్న నక్సలైట్లు
దిశ, భద్రాచలం: దంతేవాడ జిల్లా పల్లి – బార్సూర్ రహదారిలోని ఘోటియా అడవి ప్రాంతంలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్ కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఇదే క్రమంలో నక్సల్స్ ఎదురుపడి కాల్పులు జరపగా.. పోలీసులు కూడా ఎదురుదాడి చేశారు. దీంతో నక్సలైట్లు దట్టమైన అడవి, కొండవైపు పారిపోయారు. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు మూడు ఐఈడీలు, రెండ్ పిట్స్ , నక్సల్స్ సాహిత్యం, రోజువారి వినియోగ సామాగ్రి […]
దిశ, భద్రాచలం: దంతేవాడ జిల్లా పల్లి – బార్సూర్ రహదారిలోని ఘోటియా అడవి ప్రాంతంలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్ కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఇదే క్రమంలో నక్సల్స్ ఎదురుపడి కాల్పులు జరపగా.. పోలీసులు కూడా ఎదురుదాడి చేశారు. దీంతో నక్సలైట్లు దట్టమైన అడవి, కొండవైపు పారిపోయారు. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు మూడు ఐఈడీలు, రెండ్ పిట్స్ , నక్సల్స్ సాహిత్యం, రోజువారి వినియోగ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.