ఇక్కడ 'పని'మంతులు ఎక్కువ..

దిశ, రంగారెడ్డి: కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి. ఆయా జిల్లాల్లో కరోనా కేసుల నమోదుకు అనుగుణంగా లాక్ డౌన్ సడలింపు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉపాధి కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలకు గాను 545 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ 545 గ్రామాల్లో 77,408 మంది కూలీలకు ఉపాధి కల్పించి రాష్ట్రంలో అగ్రస్థానంలో […]

Update: 2020-04-28 03:42 GMT

దిశ, రంగారెడ్డి: కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి. ఆయా జిల్లాల్లో కరోనా కేసుల నమోదుకు అనుగుణంగా లాక్ డౌన్ సడలింపు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉపాధి కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలకు గాను 545 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ 545 గ్రామాల్లో 77,408 మంది కూలీలకు ఉపాధి కల్పించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ నెలాఖరుకు మరింత మంది..

రంగారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో 4 మండలాలు పూర్తిగా పట్టణ ప్రాంతం కావడం గమనార్హం. మిగిలిన 21 మండలాల గ్రామీణ ప్రాంతాల్లో 560 గ్రామాల్లో 1,74,000 జాబ్ కార్డులున్నాయి. ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డ్ ఉంటుంది. అయితే ఇప్పుడు జిల్లాలో రోజుకు సుమారు 77 వేల మందికి ఉపాధి కూలికి వస్తున్నారు. ఇంకా 15 గ్రామాల్లో ఉపాధి పనులు ప్రాంభించాల్సి ఉంది. దీంతో కూలీల సంఖ్య పెరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం షాద్ నగర్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పనులు ప్రాంభించలేదు. కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితుల్లో కూలీలను ఆదుకునేందుకు రూ. 237కు పెంచడంతో పనులు చేసేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్నారు.

సామాజిక దూరం తప్పనిసరి..

పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధి పనులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ కూలీలచే పనులు చేయిస్తున్నారు. ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ.. మాస్క్ లను ధరించి కూలీ పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో..

ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల నుంచి తొలగించడంతో పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో పనులు చేస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయని ఫీల్డ్ అసిస్టెంట్ లను విధులకు దూరం చేశారు. ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ సహాయంతో పంచాయతీ కార్యదర్శిలు ఉపాధి పనులను పర్యవేక్షిస్తున్నారు. కూలీల డబ్బులు కూడా సకాలంలోనే అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

Tags:Rangareddy,Employment,Workers,SocialWorkers,Panchayat Secretaries,social distance

Tags:    

Similar News