కాళేశ్వరంలో విచిత్రం.. హడావుడిగా రికార్డులు సిద్ధం

దిశ ప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం పంచాయితీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా అధికారులు విచారణ జరపాలని నిర్ణయిచారు. గురువారం జరగనున్న విచారణకు రికార్డులను సిద్దం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. కాళేశ్వరం సర్పంచ్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు 15న విచారణకు చేపడతామని జిల్లా పంచాయితీ అధికారి నోటీసులు జారీ చేశారు. దీంతో హాడావుడిగా గతంలో ఇక్కడ పనిచేసి బదిలి అయిన కార్యదర్శులను చేరదీసి హాడావుడిగా రికార్డులు రాయించే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ […]

Update: 2021-07-14 11:44 GMT
కాళేశ్వరంలో విచిత్రం..  హడావుడిగా రికార్డులు సిద్ధం
  • whatsapp icon

దిశ ప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం పంచాయితీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా అధికారులు విచారణ జరపాలని నిర్ణయిచారు. గురువారం జరగనున్న విచారణకు రికార్డులను సిద్దం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. కాళేశ్వరం సర్పంచ్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు 15న విచారణకు చేపడతామని జిల్లా పంచాయితీ అధికారి నోటీసులు జారీ చేశారు. దీంతో హాడావుడిగా గతంలో ఇక్కడ పనిచేసి బదిలి అయిన కార్యదర్శులను చేరదీసి హాడావుడిగా రికార్డులు రాయించే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ,పంచాయితీ కార్యదర్శులు రికార్డులు సిద్దం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. శుక్రవారం విచారణకు వచ్చే అధికారులు అర్జంట్ గా రికార్డులు రాసిన వ్యవహరాంపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Tags:    

Similar News