ఉద్యోగులకు హెల్త్ కార్డు ద్వారా వైద్యం అందించాలి
దిశ, మెదక్: కొవిడ్-19 చికిత్సను ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో చేర్చి, కరోనా సోకిన ఉద్యోగులకు హెల్త్ కార్డు ద్వారా నగదు రహిత వైద్యం అందించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కొవిడ్-19 చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడంతో పేద ప్రజలకు, ఉద్యోగులకు ఖర్చులు మోయలేని భారంగా మారుతాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నగదు రహిత, హెల్త్ కార్డు ద్వారా చికిత్స లు […]
దిశ, మెదక్: కొవిడ్-19 చికిత్సను ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో చేర్చి, కరోనా సోకిన ఉద్యోగులకు హెల్త్ కార్డు ద్వారా నగదు రహిత వైద్యం అందించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కొవిడ్-19 చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడంతో పేద ప్రజలకు, ఉద్యోగులకు ఖర్చులు మోయలేని భారంగా మారుతాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నగదు రహిత, హెల్త్ కార్డు ద్వారా చికిత్స లు నిర్వహించి ఆదుకోవాలని కోరారు.