ఆఫీసులకు వెళ్లలా వద్దా.. కరోనా గుప్పిట్లో ఉద్యోగులు

దిశ, మహబూబ్‌నగర్/అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృభిస్తోంది. దీంతో ప్రజలతో పాటు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. గడిచిన పదిహేను రోజులుగా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుంది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో బాధితులు నమోదు అవుతుండడంతో పాటు వీరిలో ఇప్పటికే చాలా మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు సైతం పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా బుధవారం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్, మరో వైద్యుడికి కరోనా […]

Update: 2020-07-16 02:57 GMT

దిశ, మహబూబ్‌నగర్/అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృభిస్తోంది. దీంతో ప్రజలతో పాటు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. గడిచిన పదిహేను రోజులుగా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుంది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో బాధితులు నమోదు అవుతుండడంతో పాటు వీరిలో ఇప్పటికే చాలా మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు సైతం పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా బుధవారం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్, మరో వైద్యుడికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో చాలా మంది తమ విధులకు హజరయ్యేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య నాలుగు వందలు దాటింది. కరోనా బారిన పడిన వారికి ప్రస్తుతం జిల్లాలోనే వైద్యం అందిస్తున్న తరుణంలో వీరికి వైద్యం అందిస్తున్న వారు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్‌కు కరోనా సోకగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 11మంది వైద్య సిబ్బందికి సైతం కరోనా సోకినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి సైతం కరోనా సోకిన నేపథ్యంలో ప్రస్తుతం వైద్య శాఖ కార్యాలయం ఖాళీగా ఏర్పడింది. ఇందులో అధికారులు విధులకు హజరు కావాలంటేనే భయపడాల్సి వస్తోంది. అదే సమయంలో జిల్లా కేంద్రంలో మరో వైద్యురాలికి కూడా కరోనా సోకినట్టు సమాచారం. తాజాగా ఊట్కూర్‌లో సైతం ఓ పోలీసు అధికారికి కరోనా సోకడంతో 13 మందిని క్వారెంటైన్ చేశారు.

మండల కార్యాలయాల్లో వివిధ ప్రాంతాల నుంచి తమతమ పనుల కోసం చాలా మంది వస్తుంటారు. వీరిలో ఎవరికి వైరస్ సోకిందో తెలియని పరిస్థితి. కీలకంగా వ్యవహరించే రెవిన్యూ శాఖ అధికారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజాప్రతినిధులు సైతం పర్యటనలు చేయడం వల్ల అటు మండల స్థాయి అధికారులు భయపడుతున్నారు. పర్యటనల సందర్భంగా ప్రజాప్రతినిధులు, వారి వెంట పదుల సంఖ్యలో నాయకులను, కార్యకర్తలు రావడం వల్ల అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా రైతువేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వెంట పెద్దఎత్తున పార్టీ శ్రేణులను వెంటపెట్టుకురావడం వల్ల అందులో ఎవరికైనా వైరస్ సోకి ఉంటే మిగతా వారికి సైతం అది వ్యాపించే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లాలో కరోనా విజ్రుంభిస్తున్న సందర్భంలో జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఆరచేతిలో ప్రాణాలు పెట్టుకుని విధులకు హజరు అవుతున్నామని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొంత మంది అధికారులు వైరస్ భారిన పడే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News