ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం కోల్పోయిన ఎలన్ మస్క్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సంపద భారీగా క్షీణించింది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు 9.1 బిలియన్ డాలర్ల సంపద తగ్గిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ రెండో స్థానాన్ని కూడా కోల్పోయారు. తాజాగా టెస్లా కంపెనీ షేర్లు 2.2 శాతం పడిపోవడంతో ఎలన్ మస్క్ రెండో స్థానం నుంచి కూడా కిందకు జారారని, ప్రస్తుతం ఆయన సంపద 160.6 బిలియన్ డార్లుగా ఉందని బ్లూమ్‌బర్గ్ సంపన్నుల జాబితా […]

Update: 2021-05-18 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సంపద భారీగా క్షీణించింది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు 9.1 బిలియన్ డాలర్ల సంపద తగ్గిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ రెండో స్థానాన్ని కూడా కోల్పోయారు. తాజాగా టెస్లా కంపెనీ షేర్లు 2.2 శాతం పడిపోవడంతో ఎలన్ మస్క్ రెండో స్థానం నుంచి కూడా కిందకు జారారని, ప్రస్తుతం ఆయన సంపద 160.6 బిలియన్ డార్లుగా ఉందని బ్లూమ్‌బర్గ్ సంపన్నుల జాబితా తెలిపింది. గతేడాది అనూహ్యంగా సంపద పెరగడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని సాధించిన మస్క్ ఆ తర్వాత రెండో స్థానానికి పరిమితమయ్యారు.

అయితే, ఇటీవల చైనాలో టెస్లా కంపెనీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్న కారణంగా షేర్ల విలువ భారీగా పడిపోయింది. దీనికితోడు ఈ ఏడాది మొదట్లో మస్క్ బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన తర్వాత దాని విలువ రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో ఎలన్ మస్క్ సంపద భారీగా క్షీణించింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువుల సంస్థ ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 161.2 బిలియన్ డార్లతో రెండో స్థానానికి చేరుకున్నారు. ఆయన సంపద ఈ ఏడాదిలో ఏకంగా 47 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం.

Tags:    

Similar News