ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్న ఇలాన్ మస్క్

డెమో-2 మిషన్ విజయవంతమయ్యాక, టెస్లా ఆటోమేకర్, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఇలాన్ మస్క్.. తాను మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కొద్దిరోజులు ట్విట్టర్‌కు దూరంగా ఉండబోతున్నట్టు ట్వీట్ చేశారు. 35 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లు ఉన్న ఆయన ఇలా ప్రకటించడంపై పలువురు భిన్న రకాలుగా స్పందించారు. కొంతమంది కారణం తెలుసుకోవాలని ప్రయత్నించగా, మరికొంతమంది ఫన్నీ జోకులు, మీమ్స్‌తో కామెంట్లు చేశారు. ‘మమ్మల్ని ఇక్కడ వైరస్‌కు వదిలేసి నువ్వు మార్స్ […]

Update: 2020-06-02 07:27 GMT

డెమో-2 మిషన్ విజయవంతమయ్యాక, టెస్లా ఆటోమేకర్, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఇలాన్ మస్క్.. తాను మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కొద్దిరోజులు ట్విట్టర్‌కు దూరంగా ఉండబోతున్నట్టు ట్వీట్ చేశారు. 35 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లు ఉన్న ఆయన ఇలా ప్రకటించడంపై పలువురు భిన్న రకాలుగా స్పందించారు. కొంతమంది కారణం తెలుసుకోవాలని ప్రయత్నించగా, మరికొంతమంది ఫన్నీ జోకులు, మీమ్స్‌తో కామెంట్లు చేశారు.

‘మమ్మల్ని ఇక్కడ వైరస్‌కు వదిలేసి నువ్వు మార్స్ పారిపోవొద్దని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘నీతోపాటు కొంతమందినైనా తీసుకెళ్లు’ అని ఇంకొకరు స్పందించారు. అయితే స్పేస్‌ఎక్స్ సంస్థ ద్వారా అనుకున్నది సాధించడం, ఇటీవల బాబు పుట్టడంతో ఇలాన్ వారితో సమయాన్ని గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. దీని గురించి ఇలాన్ మస్క్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఫాలోవర్లు ఎవరికి నచ్చింది వాళ్లు ఊహించుకుని ఆనందపడుతున్నారు.

Tags:    

Similar News