ఆర్టీసీ బస్సుపై ఏనుగు దాడి

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఆర్టీసీ బస్సుపై ఏనుగు దాడి చేసింది. కర్ణాటకలోని చామరాజనగర్‌ సమీపంలోని గుండ్లుపెటె నుంచి తమిళనాడులోని నీలగిరికి బస్సు వెళ్తుండగా అడ్డగించింది. అడవి నుంచి రహదారికి మీదకు వచ్చిన గజరాజు.. ఎదురుగా వస్తున్న తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుపైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ బస్సును వెనక్కి మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ ఏనుగు తన దంతాలతో అద్దాన్ని ధ్వంసం చేసింది. భయపడిన డ్రైవర్ తన సీటులో నుంచి లేచి ప్రయాణికుల […]

Update: 2021-09-27 09:06 GMT
RTC bus
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఆర్టీసీ బస్సుపై ఏనుగు దాడి చేసింది. కర్ణాటకలోని చామరాజనగర్‌ సమీపంలోని గుండ్లుపెటె నుంచి తమిళనాడులోని నీలగిరికి బస్సు వెళ్తుండగా అడ్డగించింది. అడవి నుంచి రహదారికి మీదకు వచ్చిన గజరాజు.. ఎదురుగా వస్తున్న తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుపైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ బస్సును వెనక్కి మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ ఏనుగు తన దంతాలతో అద్దాన్ని ధ్వంసం చేసింది. భయపడిన డ్రైవర్ తన సీటులో నుంచి లేచి ప్రయాణికుల వద్దకు వెళ్లిపోయాడు. దాదాపు అరగంట సమయం రోడ్డుపైనే ఉన్న ఏనుగు అనంతరం అడవులోకి వెళ్లిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత బస్సు గమ్యస్థానానికి పయనమైంది.

Tags:    

Similar News