ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ భారీ గిఫ్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఏప్రిల్ 10 నాటికి ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంపేర్, ఒకినోవా సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆయా […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఏప్రిల్ 10 నాటికి ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంపేర్, ఒకినోవా సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆయా కంపెనీలకు రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్స్ అందజేయడం ద్వారా ఉద్యోగస్తులకు ఉపశమనం కల్పించడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.