కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలే పరిష్కారం: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
దిశ, షాద్ నగర్: కాలుష్యం బారి నుంచి తప్పించుకోవడం లో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల సమాజానికి ఊరటనిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో ఈ వేగ ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా వాయు కాలుష్యం లెక్కకు మించి ఎక్కువగా పెరిగిపోతోందని ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను […]
దిశ, షాద్ నగర్: కాలుష్యం బారి నుంచి తప్పించుకోవడం లో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల సమాజానికి ఊరటనిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో ఈ వేగ ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా వాయు కాలుష్యం లెక్కకు మించి ఎక్కువగా పెరిగిపోతోందని ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు.
కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, జమృత్ ఖాన్, కట్ట వెంకటేష్ గౌడ్, చింటు, సర్వర్ పాషా, గంధం శేఖర్, చెట్ల నరసింహా, జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, రఘుమారెడ్డి, జాంగారి రవి, ముత్యాలు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.