మోటార్ సైకిల్ షో రద్దు
దిశ, సెంట్రల్ డెస్క్: అంతర్జాతీయంగా కొవిడ్-19 కారణంగా అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇదే బాటలో ప్రపంచవ్యాప్తంగా ఉండే బైక్ ప్రియులకు నిరాశ కలిగించేలా 2020-ఈఐసీఎంఏ మోటార్ బైక్షోను రద్దు చేస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఇదివరకే ద్వైవార్షిక కార్యక్రమాన్ని రద్దు చేసిన ఇంటర్‌మోట్ మోటార్ సైకిల్ షో నిర్వాహకులు తాజాగా ఈఐసీఎంఏ షోను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈఐసీఎంఏ 78వ ఎడిషన్ ప్రస్తుత ఏడాది నవంబర్ 3 నుంచి నవంబర్ 8 వరకు జరగాల్సి ఉండగా, […]
దిశ, సెంట్రల్ డెస్క్: అంతర్జాతీయంగా కొవిడ్-19 కారణంగా అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇదే బాటలో ప్రపంచవ్యాప్తంగా ఉండే బైక్ ప్రియులకు నిరాశ కలిగించేలా 2020-ఈఐసీఎంఏ మోటార్ బైక్షోను రద్దు చేస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఇదివరకే ద్వైవార్షిక కార్యక్రమాన్ని రద్దు చేసిన ఇంటర్‌మోట్ మోటార్ సైకిల్ షో నిర్వాహకులు తాజాగా ఈఐసీఎంఏ షోను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈఐసీఎంఏ 78వ ఎడిషన్ ప్రస్తుత ఏడాది నవంబర్ 3 నుంచి నవంబర్ 8 వరకు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి కొత్త తేదీలను ప్రకటించారు. ఈవెంట్‌ను 2021లో నవంబర్ 9 నుంచి 14 వరకు జరుగుతుందని స్పష్టం చేసింది. ఈఐసీఎంఏ ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రధాన బైక్ తయారీదారులు అందరూ ఈ షోలో పాల్గొంటారు. అయితే, గత కొంతకాలంగ కరోనా వ్యాప్తితో పాటు, ఇతర కారణాలతో పలు తయారీదారులు ఉయ్దోగాలను తొలగిస్తున్నారు. దీంతో రద్దు తప్పలేదని నిర్వాహకులు వివరించారు. ఇంతకుముందు ఏప్రిల్‌లో ఈఐసీఎంఏ-2020 ప్రదర్శన నుంచి తప్పుకుంటున్నట్టు కేటీఎం, బీఎండబ్ల్యూ కంపెనీలు వెల్లడించాయి.