ఈటల స్వగ్రామంలో టెన్షన్.. టెన్షన్

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామమైన కమలాపూర్ లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పై క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఈటల రాజేందర్ సొంత ఊరైన కమలాపూర్ లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు కమలాపూర్ లో బందో బస్తు చేపట్టినట్టు సమాచారం. ఈటలపై శుక్రవారం ఆరోపణలు వచ్చిన వెంటనే […]

Update: 2021-05-01 00:19 GMT
ఈటల స్వగ్రామంలో టెన్షన్.. టెన్షన్
  • whatsapp icon

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామమైన కమలాపూర్ లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పై క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఈటల రాజేందర్ సొంత ఊరైన కమలాపూర్ లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు కమలాపూర్ లో బందో బస్తు చేపట్టినట్టు సమాచారం. ఈటలపై శుక్రవారం ఆరోపణలు వచ్చిన వెంటనే కమలాపూర్ లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఫ్లెక్సీనీ ఈటల అనుచరులు దగ్దం చేశారు. దీంతో ఈటల అనుచరులు ఆందోళనలు చేపట్టడం కానీ, ఇతరాత్ర చర్యలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తించిన పోలీసు అధికారులు భారీగా బలగాలను మోహరించారు.

Tags:    

Similar News