తెలంగాణ ఈసెట్ నోటిఫికేషన్ 2023.. పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్) - 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది

దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్) - 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్) అభ్యర్థులకు 2023 - 24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష వివరాలు:
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్) - 2023
కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్)
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 2, 2023.
పరీక్ష తేదీ: మే 20, 2023.
వెబ్‌సైట్: https://ecet.tsche.ac.in