సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో బీఏ (ఆనర్స్) ప్రోగ్రాం
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ.. 2023 -24
దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ.. 2023 -24 అకడమిక్ ఇయర్ బీఏ ఆనర్స్ కోర్సులో ప్రవేశానికి తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్లు: 120
ప్రోగ్రాం- సీట్ల వివరాలు:
బీఏ ఆనర్స్ .. ఫ్యాషన్ డిజైన్ - 60
బీఏ ఆనర్స్ ...ఇంటీరియల్ డిజైన్ - 40
బీఏ ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ - 20
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60 శాతం మార్కులతో 2022, 2023 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన మహిళా విద్యార్థులు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2,00,000 (పట్టణం), రూ. 1,50,000 (గ్రామీణ) మించరాదు.
వయసు: జులై 1, 2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 300 ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్; రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
చివరి తేదీ: మే 14, 2023.
వెబ్‌సైట్: https://ttwrdcs.ac.in