మూడోసారి కేసీఆర్ ఎందుకు వద్దంటే..

Why not vote for KCR for the third time..

Update: 2023-11-29 00:30 GMT
మూడోసారి కేసీఆర్ ఎందుకు వద్దంటే..
  • whatsapp icon

రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రజోపయోగ పనులు చేసినప్పటికీ..రాజకీయ అవినీతి, నిధుల దుర్వినియోగం అనేవి పెద్ద సమస్యలుగా మారాయి. రాష్ట్రాన్ని గుల్లచేసి అప్పుల్లో ముంచెత్తాయి.. మూడోసారి ఆయన పాలన వద్దు అనడానికి ఇవే ముఖ్య కారణాలుగా అనుకోవచ్చు. అవసరం లేకపోయినా..రీ డిజైన్‌ల పేరుతో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి, కాంట్రాక్టర్ల జేబులు నింపి, తద్వారా వారినుంచి ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ప్రస్తుతం రాష్ట్రమంతా వినిపిస్తున్న మాట. ఇప్పటికే రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిన మిషన్ భగీరథ, పాలమూరు- రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బయటపడ్డ నాసిరకం డొల్ల నిర్మాణాలు 'కమీషన్ల' వాదనకు బలం చేకూర్చుతున్నాయి. ఒక్క సాగునీటి ప్రాజెక్టులనే కాదు. రాష్ట్రంలో నిర్మిస్తున్న రోడ్లు, భవనాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ..ఇలా అన్ని రకాల నిర్మాణాల్లోనూ అవినీతి చోటు చేసుకుంది. నాసిరకం పనులతో చేపట్టిన రోడ్డు, బిల్డింగులు నిర్మాణ దశలోనే కూలిపోతున్నాయి.. కొట్టుకుపోతున్నాయి. ముడుపుల రూపంలో వచ్చిన డబ్బుతో రాష్ట్రంలో రాజకీయంగా తనకు ఎదురు లేకుండా ఉండడం కోసం ప్రతిపక్ష పార్టీలను నిలువునా చీల్చాడని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. వీరి ఆరోపణలను జనం నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చలవిడి అవినీతి పెరిగిపోయింది. లంచం లేనిదే ఏ అధికారి పనిచేయడం లేదు. నీకది, నాకిది అన్నట్టుగా అధికారులు- అధికార పార్టీ ఎమ్మెల్యేలు కలిసిపోయి ప్రజాధనాన్ని పంచుకుతింటున్నారు. ఎన్నో దశాబ్దాల పాటు పోరాటం చేసి కష్టపడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి విడదీసినప్పుడే అసలైన తెలంగాణ. స్వేచ్చాయుత తెలంగాణ ప్రజా తెలంగాణ

- శ్రీనివాస్ గౌడ్ ముద్దం

వ్యాపారవేత్త

86869 00344

Tags:    

Similar News

చలి పులి

సంక్రాంతి