ఎవరి ప్రయోజనాల కోసం ప్రపంచ సుందరి పోటీలు..

పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు అనే వార్త వినగానే ప్రగతిశీల భావాలు

Update: 2025-04-29 00:30 GMT
ఎవరి ప్రయోజనాల కోసం ప్రపంచ సుందరి పోటీలు..
  • whatsapp icon

 పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు అనే వార్త వినగానే ప్రగతిశీల భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. చాకలి ఐలమ్మ, సమ్మక, సారలమ్మ లాంటి వీర వనితలు పుట్టిన గడ్డ మీద అర్ధనగ్న ప్రదర్శనలతో పోటీలు నిర్వహించడం వలన తెలంగాణ సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో పాలక వర్గాలకే తెలి యాలి. హైదరాబాద్ వేదికగా 72వ ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యమిస్తోంది ప్రభుత్వం. ఈ పోటీలలో పాల్గొనడానికి 144 దేశాలనుండి వచ్చారు. అయితే ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన తెలంగాణలో ఈ ఆతిథ్యం ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసమని ఆలోచన చేస్తే కచ్చితంగా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే అని సులభంగానే అర్థం అవుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వినియోగ అధారిత ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. దీనిని అవకాశంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలు కాస్మోటిక్ లాంటి వస్తువులకు అత్యధిక ప్రచారం చేసి బ్రాండ్ ఇమేజ్ కల్పించుకొని మార్కెటింగ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ప్రపంచం సుందరి పోటీలకు వెన్ను దన్నుగా నిలుస్తున్నాయి. ఈ సదస్సులో పాల్గొనాలంటూ పర్యాటక, అతిథ్య రంగాలలో పేరుగాంచిన మహీంద్రా, తాజ్, ఓబేరాయి లాంటి కంపెనీలకు ఆహ్వానాలు పంపించారు. దీన్ని బట్టి ఈ పోటీలు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే అని సులభంగా అర్ధం అవుతుంది. అందుకే తెలంగాణ సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేని కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం నిర్వహించే ఈ పోటీలను తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.

-పల్లె నాగరాజు,

8500431793

Tags:    

Similar News