మాజీ సైనికుల సంక్షేమం ఎక్కడ?

Where is the welfare of ex-servicemen?

Update: 2023-05-16 23:15 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక జీఓలు అమలు చేసేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొమ్మిది సంవత్సరాలుగా ఏ ఒక్క జీవో కూడా అమలుకు నోచుకోవడం లేదు. పైగా సైనికుల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్లో లభించే సరుకుల మీద భారతదేశంలో 28 రాష్ట్రాలలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎక్కువ టాక్స్ విధించి సైనికులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ పెంచకపోగా, మిగిలిన ఖాళీల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ నిర్వహించడం లేదు. 5 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కేటాయించడం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన వారికి ఎన్వోసీలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు గురిచేస్తున్నారు, యుద్ధ క్షేత్రాలలో వీరమరణం పొందిన సైనికులకు 300 గజాల ఓపెన్ ప్లాట్, మాజీ సైనికులకు 175 గజాల ఓపెన్ ప్లాట్ కూడా కేటాయించడం లేదు. అయితే మాజీ సైనికుల కోసం ప్రభుత్వ భూమి లేదంటూనే, ఇంకోవైపు ప్రతి జిల్లాలో హెచ్ఎండిఏ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆధ్వర్యంలో లేఔట్లు చేసి స్వయాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ నిర్వహిస్తూ, మాజీ సైనికుల సంక్షేమం పట్ల వివక్ష చూపుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాజీ సైనికుల సంక్షేమం కోసం ఇవ్వాల్సిన జీఓలపై దృష్టి సారిస్తూ వాటిని విడుదల చేయాలని కోరుకుంటున్నాం.

బందెల సురేందర్ రెడ్డి

మాజీ సైనికుడు

83749 72210

Tags:    

Similar News