ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్‌లు ప్రాణాంతకమే..!

Vaccines that save lives are fatal says scientists

Update: 2024-05-11 01:15 GMT

ఒక వ్యాక్సిన్ అన్ని క్లినికల్ ట్రయిల్స్ పూర్తి చేసుకుని ప్రజా వినియోగంలోకి రావడానికి కనీసం 10 నుంచి 13 సంవత్సరాలు పడుతుందని అంచనా. కానీ నెలలలోపే క్లినికల్ ట్రయిల్స్ పూర్తి చేసినట్లు ప్రకటిస్తూ గ్లోబల్ ఫార్మా సంస్థలు ప్రవేశపెట్టిన కొవిడ్-19 వ్యాక్సిన్‌లకు ప్రభుత్వాలు ఆమోదముద్ర వేశాయి. ఇలా ఎంతో ముందస్తుగా తీసుకొస్తున్న కొవిడ్ టీకాలను తీసుకున్న కొద్ది కాలంలోనే ప్రతికూల ప్రభావాలు బయటపడ్డాయి. కానీ వీటిపై దర్యాప్తు కూడా జరపలేదు.

కొవిడ్ టీకా దుష్ప్రభావాలకు గత మూడేళ్లలో 10 వేలమందికి పైగా మరణించారని సైంటిస్టుల ఆరోపణ. రక్తం గడ్డకట్టడం, శరీరంలోని ప్లేట్‌లెట్‌ల సంఖ్య పడిపోవడం దీని ప్రధాన సమస్యలుగా నిర్దారించారు. నాలుగేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే.. ఇంతవరకు సైంటిస్టులు రూపొందించిన వ్యాక్సిన్‌లలో కోవిడ్ టీకాకు మించింది లేదని 2021 ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఊదరగొట్టారు. వివిధ దేశాల్లోని వైద్య శాఖలు ఆమోదించిన ఈ టీకాలను తప్పనిసరిగా వేసుకోవాలని ప్రభుత్వాలు ఒత్తిడి చేశాయి. ఫలితం.. ఒక్క భారతదేశంలోనే 175 కోట్లకు పైగా కోవిడ్ టీకాలను జనం తీసుకున్నారు. ప్రధానంగా గ్లోబల్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ చాలా ఎక్కువగా 70 దేశాల్లో వినియోగంలోకి వచ్చింది.

మనుషులు కుప్పగూలిపోతున్నారు...!

భారతదేశంలో కొవిషీల్డ్ అనే పేరుతో పిలిచిన ఈ వ్యాక్సిన్‌ని పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసి పంపిణీ చేసింది. విపరీత ప్రచారం చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్, రోగనిరోధకత తర్వాత రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కి చెందిన అరుదైన దుష్ప్రభావానికి కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా ఇప్పుడు స్వయంగా అంగీకరించింది. దీర్ఘకాలం పాటు దీని దుష్ప్రభావాలు కొనసాగుతాయని, ఆకస్మిక మరణాలు సంభవిస్తూనే ఉంటాయని ప్రముఖ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. టీకా వేసుకున్న తర్వాత 45 రోజుల్లోపే దుష్ప్రభావాలు పొడసూపుతాయని అప్పట్లోనే వైద్యులు పేర్కొన్నారు. కానీ మూడేళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉన్న మనుషులు అమాంతం కూలబడి మరణిస్తుండటంతో భయాందోళనలు కలుగుతున్నాయి.

దుష్ప్రభావాలున్నది నిజమే!

2020 చివరలో ఆవిష్కరించిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ని నాలుగేళ్ల తర్వాత వెనక్కు తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా బ్రిటన్ కోర్టుకు తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సిన్ రోగనిరోధకత తర్వాత రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కి చెందిన అరుదైన దుష్ప్రభావానికి కారణమవుతుందని అంగీకరించింది. ఈ దుష్ప్రభావాలు యావత్ సమాజంపై దీర్ఘకాలంపాటు ప్రభావం చూపనున్నాయని ప్రజారోగ్య నిపుణులు చెబుతుండటంతో అస్ట్రాజెనెకాపై కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొవిడ్ 19 టీకాలు వేయించుకున్న వారిలో పదివేల మందికి పైగా ప్రపంచమంతటా మరణించినట్లు నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో టీకా వినియోగదారుల్లో కొత్త భయాలు నెలకొంటున్నాయి.

మరణాలను విస్మరిస్తూ..

అయితే, కొవిడ్ వ్యాక్సిన్‌ల బాధితులందరికీ, వారి కుటుంబ సభ్యులతో సహా, వ్యాక్సిన్ తయారీదారులతో పాటు ఒక యంత్రాంగం ద్వారా పరిహారం చెల్లించాలని భారత ప్రభుత్వాన్ని అవేకెన్ ఇండియా మూవ్‌మెంట్ కోరింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ భద్రతపై వైద్యుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని కోవిడ్ వ్యాక్సిన్‌ల వెనుక ఉన్న శాస్త్రీయతను సమీక్షించాలని వాటి వాణిజ్యీకరణతో పాటు వ్యాక్సిన్ ప్రతికూల సంఘటనలను నిర్ధారించడానికి నిఘా యంత్రాంగాన్ని అమలు చేయాలని డాక్టర్ మిట్టల్ కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత పెరుగుతున్న విషాద మరణాల కేసులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, శాస్త్రీయ పరిశోధన, ఎపిడెమియాలజీని ప్రారంభించకుండా కొవిడ్ వ్యాక్సిన్‌లను 'సురక్షితమైన, సమర్థవంతమైన'విగా ప్రచారం చేస్తూనే ఉందని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ తరుణ్ కొఠారి సైతం ఆరోపించారు.

రుతుస్రావంలోనూ అసాధారణ లక్షణాలు..

ముఖ్యంగా భారతదేశంలో టీకాల గురించి ఇప్పటికీ చాలా తక్కువ అవగాహన ఉందని గైనకాలజిస్ట్, ఆంకాలజిస్ట్ డాక్టర్ సుజాత మిట్టల్ తెలిపారు. సెప్టెంబర్ 2022 లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో వేలాది మంది మహిళలు తమ ఋతు చక్రాలలో అసాధారణ లక్షణాలను నివేదించారని, ఇది టీకా దుష్ప్రభావంగా తరువాత నిర్ధారించబడిందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌ తయారీదారుల వద్ద స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక దుష్ప్రభావాలు లేదా మరణాలపై పూర్తి సమాచారం కానీ, డేటా కానీ లేకుండానే వ్యాక్సిన్ ప్రారంభించబడిందని ఆరోపించారు.

టీకా తయారీ ఉపసంహరణకు కారణం

బహుళ, విభిన్న కొవిడ్-19 వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేయబడినందున, మార్కెట్లో అనేక ఇతర వ్యాక్సిన్‌లు ఉన్నందున కొవిడ్-19 వ్యాక్సిన్‌ ప్రపంచవ్యాప్త ఉపసంహరణను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రాజెనెకా తెలిపింది. కానీ వాస్తవానికి కోవిడ్-19 ఔషధాల అమ్మకాలు క్షీణించడంతో ఆస్ట్రాజెనెకా గత సంవత్సరం అనేక ఒప్పందాల ద్వారా శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వ్యాక్సిన్‌లు, స్థూలకాయ మందుల తయారీలోకి వెళ్లడం ప్రారంభించింది. 2021లో ఆస్ట్రాజెనెకా టీకాల ఆదాయం మార్కెట్ అంచనాలను మించిపోయి సంస్థకు అపార లాభాలను కొని తెచ్చింది. ఒకే సంవత్సరంలో 13 బిలియన్ డాలర్లను కొవిడ్-19 వ్యాక్సిన్ అమ్మకాల ద్వారా సంస్థ ఆర్జించింది. లాభాలు తగ్గిపోగానే ఆ ఉత్పత్తిని నిలిపివేసి కొత్త వ్యాక్సిన్‌ల తయారీకి గ్లోబల్ ఫార్మా సంస్థలు పూనుకోవడం తెలిసిందే.

వ్యాక్సిన్ యుద్ధం.. ఎవరిపై?

భూమ్మీద నుంచి మటుమాయమైపోయాయని ఊదరగొట్టిన మశూచి, పోలియో తిరిగి పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించిన చరిత్రను చూస్తే వ్యాక్సిన్ సర్వరోగ నివారిణి కాదనే అభిప్రాయం బలపడుతోంది. వైరస్‌లపై వ్యాక్సిన్ యుద్ధాలు జరుగుతున్నట్లే మానవదేహంపై కృత్రిమ వ్యాక్సిన్‌ల ప్రయోజనాలు, దుష్ప్రభావాలపై కూడా గత వందేళ్లుగా తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. పారిశుధ్యం, తాగునీరు, పోషకాహార లోపం వంటి సమస్యలతో సతమతమవుతున్నంత కాలం పోలియో, మశూచి వంటి పురాతన వ్యాధులు, కొవిడ్ వంటి ఆధునిక వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉంటాయని మరవరాదు. ఈ వ్యాక్సిన్‌లన్నీ పాదరసం సమ్మేళనమైన థెమరసాల్ అనే సంరక్షణ రసాయనంతో తయారవుతుండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో వివిధ ప్రాణాంతక వ్యాధులనుంచి మానవాళిని రక్షించిన వ్యాక్సిన్‌లు నేడు తరచూ నిరర్థకంగానూ, ప్రాణాంతకాలుగానూ మారడం శోచనీయం. బహుళ జాతి మందుల కంపెనీల లాభాలే పరమావధిగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌లు ప్రజారోగ్యానికి ఏ మేరకు తోడ్పడుతున్నాయన్నది ప్రశ్నార్థకమవుతోంది.

రాజశేఖరరాజు

73964 94557

Tags:    

Similar News