ఏటీఎం విత్ డ్రాపై బాదుడు ఆపండి!

ఇకపై సామాన్యులు డబ్బు అవసరమైనప్పుడు దగ్గరలో కనిపించిన ఏటీఎంకు వెళ్లి విత్‌డ్రా చేసే ముందు ఓసారి ఆలోచించండి.

Update: 2025-03-27 00:30 GMT
ఏటీఎం విత్ డ్రాపై బాదుడు ఆపండి!
  • whatsapp icon

ఇకపై సామాన్యులు డబ్బు అవసరమైనప్పుడు దగ్గరలో కనిపించిన ఏటీఎంకు వెళ్లి విత్‌డ్రా చేసే ముందు ఓసారి ఆలోచించండి. ఈ ఏడాది మే 01వ తేదీ నుంచి, ఏటీఎం ద్వారా డబ్బు విత్‌డ్రా చేయడం మీకు భారంగా ఉండొచ్చు. ఇటీవలే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల ఒత్తిడి మేరకు మే 1 నుంచి ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇతర బ్యాంక్‌ ఏటీఎంలను ఉపయోగించే కస్టమర్లు నగదు ఉపసంహరించుకోవడం లేదా నగదు చెక్ చేసుకోవడం వంటి పనులు ఇప్పుడు మరికొంచెం ఖరీదవుతుంది. ఇకపై వినియోగదారులు సొంత బ్యాంక్‌ కాకుండా, వేరే బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలుల నిర్వహిస్తే విధించే రుసుమును ఇంటర్‌ఛేంజ్ ఫీజ్‌ అంటారు. ఈ ఫీజును మనకు నెలకు ఇచ్చిన మెట్రో నగరాల్లో ఐదు ఉచిత లావా దేవీలు.. మెట్రోయేతర నగరాల్లో మూడు ఉచిత లావాదేవీల పరిమితి దాటినప్పుటే వసూలు చేస్తారు. వేరే బ్యాంక్ ఏటీఎంతో నగదు ఉప సంహరణ చేస్తే ఒక్క లావాదేవీకి రూ.17 నుండి రూ.19కి, బ్యాలన్స్ తనిఖీ చార్జీ రూ.6 నుండి రూ.7 వసూలు చేస్తారు. దేశంలో డిజిటల్ పేమెంట్ల వినియోగం బాగా పెరి గింది కాబట్టి ఇదేమీ పెద్ద సమస్య కాదు అనుకోవద్దు. ఇప్పటికీ చాలా యూపీఐ పేమెంట్ యాప్‌ల‌లో సర్వర్ సమస్యలు వస్తున్నాయి. మే 01 నుండి ఈ కొత్త రూల్ అమలైతే వాటి వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇక ఇప్పటికీ చాలామందికి ఇంటర్నెట్ కనెక్టివిటీ గల స్మార్ట్‌ఫోన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది చేతిలో ఉన్నాయి. ఆ గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు తెలిసింది బ్యాంక్ సందర్శించడం లేదా ఏటీఏం ఉపయోగించడమే. ఇది అమలైతే వారిపై భారం పడదా? అందుకే ఏటీఎం చార్జీల పెంపును ఆర్‌బీఐ ఉపసంహరించుకోవాలి. అలాగే చాలా ఏటీఎంలలో 500 రూపాయల నోట్లు మాత్రమే ఉంటున్నాయి. చిల్లర నోట్లు లభించడం గగనంగా మారింది. అందుకే చిల్లర నోట్ల కొరత తీర్చాలని సామాన్య వినియోగదారులు విన్నవించుకుంటున్నారు.

-ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Tags:    

Similar News