మాతృ స్పర్శకై పరితపించే
పసి హృదయపు తొలి నాదం కవిత్వం
బిడ్డనూరడించ అలవోకగా
తల్లిపాడే జోలపాట కవిత్వం
శ్రమజీవుల స్వేదబిందువుల
నాదం కవిత్వం
మూగబోయిన గొంతుల
ధిక్కార గళం కవిత్వం
అణచబడిన వర్గాల
సమానత్వ ఘోష కవిత్వం
శ్రమదోపిడి నెదిరించు ఎర్ర
సూరీడుల తిరుగుబాటు కవిత్వం
మనసులు మాట్లాడుకునే
మూగ భాష కవిత్వం
తలపండినవారి అలవోకపు మాటలలో
ఉంది అసలు సిసలు కవిత్వం
స్పందించే గుణం నీకుండాలి గానీ
ఎందులో లేదు కవిత్వం
అంతటా నిబిడీకృతమైన
నిశ్శబ్ద విప్లవం కవిత్వం
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
99080 57980