శోభకృత్ ఉగాది

poem on ugadhi

Update: 2023-03-21 18:30 GMT

కాలం పుట్టినరోజు ఉగాది

కాలం ప్రాణుల పుట్టుక పునాది

కాలం ఎప్పుడూ కొత్తగానే

క్యాలెండర్లు మారడం మనకు కొత్త

కాలం అని కనిపించని రథంపై

జీవుల బ్రతుకులు భ్రమణాలై

సెకండ్లు నిమిషాలు గంటలు

తిథి నక్షత్ర వారం రోజులు

ఋతువులు సంవత్సరాలు ఉగాదిలై

యుగాలు కల్పాలై కదిలిపోతుంది!

ఓ నవ వసంత ఉగాది

నీ రాకతో వెలుగు లోగిళ్ళు

ఇంటింటా షడ్రుచుల పచ్చళ్ళు

పచ్చని పందిళ్ళ శోభతో

ప్రకృతి నీకు స్వాగతం పలుకుతుంది

ప్రకృతి తన ధర్మం తాను నిర్వర్తిస్తుంది

శిశిరం ఎప్పటి వలె చిగురు వేస్తుంది

గండు కోయిలలు కమ్మని పాటలతో

నీకు జేజేలు పలుకుతుంది!

కరోనా కల్లోలాన్ని

కళ్లారా చూసిన ఓ మనిషి

నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు!

ఈ శోభకృత్ ఉగాది

నీకు అన్నీ శుభాలు కలుగజేస్తుంది!

పి.బక్కారెడ్డి

9705315250

Tags:    

Similar News