ఇది అహంకారానికి అనునయ తీర్పు
ఇది దొరల పాలనకు నిఖార్సైన తీర్పు
ఇది మత మౌఢ్యానికి మంచి తీర్పు
ఇది ధరల పెరుగుదలకు నిరసన తీర్పు
ఇది అధికారానికి ప్రజల ధర్మమైన తీర్పు
ఇది కార్పొరేట్ల అండకు కాటు వేసిన తీర్పు
ఇది పాలకులకు గుణపాఠం నేర్పిన తీర్పు
ఇది పార్టీలకు మేలుకొలుపు లాంటి తీర్పు
ఇది భవిష్యత్తుకు అద్దం పట్టే తీర్పు
ఇది ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన తీర్పు
ఇది తెలంగాణ ప్రజల తెలివైన మనో తీర్పు
ఇది మన ఆత్మగౌరవానికి అసలైన తీర్పు
ఇది దశాబ్దాల చరిత్రల కాంగ్రెస్ గెలుపు తీర్పు
తెలంగాణ చరిత్ర తిరగరాసిన తీర్పు
జై తెలంగాణ ...జై జై తెలంగాణ !!!
- న్యాలకంటి నారాయణ
9550833490