నాకిప్పుడు
కసితీరా రాయాలనుంది
పేపర్ మీద పెన్ను రక్తం
కక్కేలా రాయాలనుంది
తల్లిపాలు తాగుతుంటే రక్తం
కనబడిన రొమ్ము గాయపడ్డట్లు
దొర పాలనలో నిరంకుశత్వాన్ని
రాస్తుంటే చదివేవాడి ఎదపై
వెంట్రుకలు నిక్కపొడుచుకోని
తల్లి రొమ్మును గాయపర్చినోడిని
అంతం చేసేలా రాయాలనుంది
పదేళ్ల నా తెలంగాణ తల్లి ఎద
పాలకు బదులు రక్తమే ఇచ్చింది
ఆ రక్తాన్నివ్వడానికి అసలు
కారకుడెవడో తెలిసింది
కొలువులకై కొట్లాడి కొట్లాడి అలసి
వాడుబట్టిన ముఖాన్ని కడుకుంటుంటే
చేతినిండా రక్తమే అంటుకున్నది
ఆ ముఖంపై లాఠీ దెబ్బలు
కొట్టినోడు ఎవడో తెలిసింది
ప్రశ్నించినందుకు బంధించినోడు
ఎవడో తెలిసింది
నేనిప్పుడు విడుదలైన
ఖైదీనై రాయాలనుంది
గాయాలు మాని కోలుకున్న
రోగినై రాయాలనుంది
పదేళ్ల నిరంకుశత్వానికి
అంతం పలికిన ఈ సమాజానికి
జై కొడుతూ రాయాలనుంది
వచ్చేటోడు సక్రమంగా లేకపోతే
తరిమికొట్టెలా నాకిప్పుడు
కసితీరా రాయాలనుంది
కమ్మ మీద అక్షరాలే
కన్నీటి బాష్పాలుగా రాయాలనుంది
ఎజ్జు మల్లయ్య
96528 71915