అగ్గినౌక

Poem

Update: 2023-08-07 23:30 GMT

సముద్రం గుండెల్లో

వేలెడంత తూటా

ఎవరు వీడు

ఆకాశాన్ని, భూమిని

గజ్జెలు చేసిన వీరబాహుడు.

నేత్రం సూర్యునిలో

దుమ్ము కొట్టానన్న చంద్రిగాడ్ని

మడంతో మట్టేశాడు

ఎవడు వీడు

అడవి సింహనాదాన్ని

భాగమతి గుండెల్లో నినదించిన

బెబ్బులికి విభూది

కుక్కల కొరుకుళ్ళా

ఒరేయ్! గద్ధరంటే

ఈ యుగం నల్లసముద్రంలో

నడుస్తున్న అగ్గి నౌక.

గుంపు పాటల్లో పుట్టిన

యుగ గీతిక.

అది సంస్కృతి -

అది సంఘర్షణ.

గుండె పొరల్నిండా

మంటలు మంటలు

మూడు రోజులే కాదు

మూడు గంటలకే లేచి నేను

రెండోసారి వచ్చాను కాచుకోండి

ఇక ముద్దాయిలందరూ

బారులు తీరండి

శిలువనెక్కిన వానిదే

అంతిమ తీర్పు

(గద్దర్‌‌పై పాతికేళ్ల క్రితం తూటా పేల్చిన చర్యకు నిరసనగా)

డా. కత్తి పద్మారావు

99487 48812

Tags:    

Similar News