సంక్షేమమే సరిపోతుందా..?

చరిత్రలో ఉత్తమంగా కనబడుతున్న దేశాలన్ని తమ ప్రజల విద్యకై పెట్టుబడి పెట్టినవే." అంటారు అమెరికా

Update: 2025-04-01 01:00 GMT
సంక్షేమమే సరిపోతుందా..?
  • whatsapp icon

చరిత్రలో ఉత్తమంగా కనబడుతున్న దేశాలన్ని తమ ప్రజల విద్యకై పెట్టుబడి పెట్టినవే." అంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. మరి అలాంటి విద్యాభివృద్ధికై తెలం గాణ రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 7.57%. ఇందులో మాధ్యమిక విద్యకు 19,464 కోట్లు, ఉన్నత విద్యకు 3,643 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే అంకెలలో అధికంగా కనబడినప్పటికి కేటాయింపులలో 0.20% తగ్గుదల ఉంది.

యూనివర్సిటీలకు కేటాయింపులు దారుణం..

దేశంలో చాలా రాష్ట్రాలు విద్యాభివృద్ధికై బడ్జెట్‌లలో 10 -15% వరకు నిధులు కేటాయిస్తున్నారు. ప్రతి ఏటా దానిని పెంచుతూ పోతున్నారు కూడా.. మన రాష్ట్రంలోనూ 2014-15 సంవత్సర బడ్జెట్‌లో విద్యారంగానికి 10.89% నిధులు కేటాయించారు. పెరుగుతున్న విద్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం నిధులు పెంచడం తప్పనిసరి. అలా జరిగితేనే విద్య అందరికి అందుబాటులో ఉంటుంది. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి రాగానే బడ్జెట్‌లో విద్యాభివృద్ధికై 15% నిధులు కేటాయిస్తామని చెప్పి, రెండు దఫాలు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినా అటువైపు అడుగులు పడకపోగా మరింత తగ్గించడం విచారకరం. అలాగే ఉన్నత విద్యా కేంద్రాలైన యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంలో, వాటి అభివృద్ధి విష యంలో శీతకన్ను వేయడం బాధాకరం. గత బడ్జెట్‌లో కేటాయించిన నామమాత్రపు నిధుల నే మళ్లీ కేటాయించారు. ఇవి కేవలం యూనివర్సిటీల నిర్వహణకు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుంది. మరి మౌలిక వస తులు, అభివృద్ధి ప్రణాళికల సంగతి ఎలా? ఇక శాసనసభ వేదికగా చాకలి ఐలమ్మ యూ నివర్సిటీ అభివృద్ధికి 550 కోట్లు కేటాయిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించినా, ఆర్థిక పద్దుల్లో మాత్రం వంద కోట్లు కేటాయించినట్లే కనబడుతుంది.

ఖర్చు చేయడాన్ని పర్యవేక్షించాలి!

పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి ఆటంకం పిల్లల చదువుల ఖర్చులు. కావున ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల పేరిట ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఖర్చుచేసే బదులు, సబ్బండ వర్ణాల పిల్లలు చదివే ప్రభుత్వ యూనివర్సిటీలను, కళాశాలలను, పాఠశాలలను, హాస్టల్‌లను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో మరింత నిదులు కేటాయిస్తే బాగుండేది. దీనివలన నాణ్యమైన విద్య అందరికి సమానంగా అందేది. అభివృద్ధి అంటే పైపై మెరుగులు, కొందరికి ప్రాధాన్యత కాదు. అందరికి సమాన అవకాశాలు అందాలి. అది కేవలం విద్య ద్వారానే సాధించబడుతుంది. సమాజంలో శాశ్వత, గుణాత్మక అభివృద్ధి మార్పులు విద్య ద్వారానే సాధ్యం. అయితే నిధులు కేటాయించడమే కాదు, వాటిని విడుదల చేయడం, ఉద్దేశించిన రీతిలో పారదర్శకంగా ఖర్చు చేయడాన్ని పర్యవేక్షించడం అంతకంటే ముఖ్యం. లేదంటే ప్రచార ఆర్భాటం కోసం వేసుకున్న లెక్కల పద్దులుగా బడ్జెట్‌ను ప్రజలు భావించే అవకాశం ఉంది.

- డాక్టర్ సందెవేని తిరుపతి

98496 18116

Tags:    

Similar News