సంతోష భారతం స్వప్నించేనా....!

ఈ నివేదిక ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గాలప్, యుఎన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్

Update: 2025-04-01 00:30 GMT
సంతోష భారతం స్వప్నించేనా....!
  • whatsapp icon

సంతోషం అనేది మన మనసుకు అనుభూతి ఇచ్చే ఒక సానుకూల భావోద్వేగం. ఇది మన జీవితంలో మెరుగైన అనుభవాలు, విజయం, ప్రేమ, స్నేహం, ఆశ, మనశ్శాంతి లాంటి విషయాల ద్వారా ఏర్పడుతుంది. జీవితంలో చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని పొందగలిగితే నిజ మైన సంతోషాన్ని అనుభవించగలం. భారతదేశం ప్రపంచ సంతోష నివేదిక 2025లో 10 పాయింట్ స్కేల్‌పై 4.839 హ్యాపీనెస్ స్కోర్‌తో 118వ స్థానం దక్కించుకుంది. ప్రపం చంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ ఎనిమిదవసారి వరుసగా 10 పాయింట్ల స్కేల్ పై 7.74 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో మొదటి పది ర్యాంకుల్లో పెద్ద దేశాలు ఏవీ లేవు. చిన్న దేశాలైన డెన్మార్క్, ఐస్ లాండ్, స్వీడన్, నెదర్లాండ్, కొస్తారికా వంటి చిన్న దేశాలే ఉన్నాయి. అమెరికా 24వ స్థానంలో, చైనా 68వ స్థానంలో, సింగపూర్ 34వ స్థానంలో నిలి చింది. ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానాన్ని కైవసం చేసుకుంది.

140 దేశాలను మదింపు చేస్తే..

ఈ నివేదిక ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గాలప్, యుఎన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, స్వతంత్ర సంపాదకీయ బోర్డు ద్వారా ప్రచురించబడుతుంది. ఈ నివేదిక మొదటగా 2012లో ప్రచురించారు. ఈ సంవత్సరం మార్చి 20న 13వ ఎడిషన్ విడుదలైంది. ఈ నివేదిక తలసరి ఆదాయం, విద్య, ఆరోగ్యం, ఆత్మ సంతృప్తి, జీవన కాలం, అవినీతి, సామాజిక మద్దతు, స్వేచ్ఛా, సమానత్వం, వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 140 పై చిలుకు దేశాలను మదింపు చేశారు. గాలప్ సీఈఓ జాన్ క్లిఫ్టన్ ప్రకారం, ఆనందం ఆర్థిక సంపదకు మించింది. బలమైన సామాజిక బంధాలు.. భద్రతా భావం, సామాజిక మద్దతు, వ్యవస్థలకు ప్రాప్యత, సామూహిక కార్యకలాపాలు, సంప్రదాయాలు వంటి భాగస్వామ్య అనుభవాలు. కుటుంబ నిర్మాణం, గృహ స్థిరత్వం, తక్కువ అవినీతి, అధిక ఆయుర్దాయం కారణంగా నార్డిక్ దేశాలు రాణిస్తూనే ఉన్నాయి. కోస్టారికా, మెక్సికో చారిత్రాత్మక ముందుకు వచ్చాయి. దీనికి కారణం బలమైన కుటుంబ బంధాలు.. ఇక భౌగోళిక రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ తన 8వ స్థానాన్ని నిలుపుకోగలిగింది.

మన దేశంలో..

భారతదేశం విషయానికి వస్తే నిలకడగా ఆర్థికా భివృద్ధి సాధిస్తున్నా, ప్రజలు మాత్రం అంత సంతోషంగా లేరని తెలుస్తుంది. సమా జంలో మితిమీరిన సామాజిక, ఆర్థిక అసమానతలు, హత్యలు, నేరాలు, లింగ వివక్ష, అవినీతి, మహిళా సంరక్షణ సన్నగిల్లడం వంటి విషయాలు ప్రజలను సంతోషంగా ఉండకుండా చేస్తున్నాయని తెలుస్తుంది. దేశంలో ఆర్థికాభివృద్ధి మాత్రమే ఆనందానికి, సంతోషానికి మూలం కావని ఈ నివేదిక స్పష్టంగా మనకు తెలియ జేస్తుంది. అదే విధంగా వ్యక్తిగతంగా ప్రతి భారతీయుడు నిజమైన సంతోషం మంచి సామాజిక బంధాల్లో, అవసరానికి ఇచ్చిపుచుకోవడంలో, ఆపదలో ఉన్నప్పుడు పక్కవారికి నిస్వార్ధంగా చేయందించుటలో ఉందని గ్రహించాలి. విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలతో దేశానికి మంచి చరిత్ర ఉన్నప్పటికీ, వాటికి ఇంకా మెరుగులు దిద్దే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తే తప్ప సంతోష భారతం స్వప్నించదు.

-కమలహాసన్ తుమ్మ

95056 18252

Tags:    

Similar News