పొట్టి శ్రీరాములు పీహెచ్‌డీ సీట్ల కేటాయింపుపై విచారణ చేయండి!

2023-24 విద్యాసంవత్సరానికి తొమ్మిది కోర్సులలో పీహెచ్‌డీ అడ్మిషన్లు నింపడం కోసం, మార్చి 17 - 20 వరకు పొట్టి శ్రీరాములు

Update: 2025-04-18 00:30 GMT
పొట్టి శ్రీరాములు పీహెచ్‌డీ సీట్ల కేటాయింపుపై విచారణ చేయండి!
  • whatsapp icon

2023-24 విద్యాసంవత్సరానికి తొమ్మిది కోర్సులలో పీహెచ్‌డీ అడ్మిషన్లు నింపడం కోసం, మార్చి 17 - 20 వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు మౌఖిక పరీక్షలను నిర్వహించారు. ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేశారు. అయితే ఆ పరీక్ష ఫలితాలు, అర్హత కలిగిన విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉన్నాయి. యూనివర్సిటీ వారు స్వయంగా విడుదల చేసిన ప్రాస్పెక్టస్‌కి పూర్తి విరుద్ధంగా పీహెచ్‌డీ సీట్ల కేటాయింపు జరిగింది. ఇది యూనివర్సిటీ ప్రతిష్టకే భంగం కలిగించేలా ఉన్నది. ఇటీవల నిర్వహించిన ఇంట ర్వ్యూల ప్రక్రియ సైతం పారదర్శకంగా నిర్వహించడంలో ఆ యూనివర్సిటీ విఫలమైంది. ఆ యూనివర్సిటీ చర్యలతో ప్రతిభ కలిగినవారికి, పరిశోధన చేయగలిగిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి వెంటనే ఉన్నత విద్యామండలి కలుగజేసుకుని తెలుగు యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ ఫలితాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని అర్హు లైన వారికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.

- అర్. ఎల్ మూర్తి

ఎస్‌.ఎఫ్‌.ఐ, తెలంగాణ

82476 72658

Tags:    

Similar News