6 నెలల్లో కరోనా టీకా ఎలా సాధ్యం? వ్యాక్సిన్ పరిశోధనలో నిజానిజాలు..

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 మహమ్మారికి విరుగుడుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ని శాస్త్రజ్ఞులు శరవేగంగా కనిపెట్టారు. తక్కువ కాలంలోనే కోట్లాదిమంది

Update: 2024-05-03 01:15 GMT

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 మహమ్మారికి విరుగుడుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ని శాస్త్రజ్ఞులు శరవేగంగా కనిపెట్టారు. తక్కువ కాలంలోనే కోట్లాదిమంది తీసుకున్న ఈ వ్యాక్సిన్ ప్రాణాంతకమైన దుష్రభావాలను కలిగిస్తోందని తొలి నుంచి వార్తలు వచ్చాయి. తాజాగా కొవిషీల్డ్ తయారు చేసిన బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజనకానెకా వీటిని అంగీకరించింది. అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి పరిస్థితికి కొవిషీల్డ్ కారణమవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో పేర్కొన్నట్టు బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ నివేదించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో బ్రిటిష్ ఫార్మా కంపెనీకి చెందిన ఆస్ట్రాజనకానెకా టీకా కనిపెట్టింది. దీనిని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజనకానెకా... చింపాంజీ అడెనోవైరస్‌ని వెక్టర్‌గా ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ టీకాను జామీ స్కాట్ అనే వ్యక్తికి మొదటగా వేశారు. అలా ఆ కంపెనీ అభివృద్ధి చేసిన ఆ టీకానే.. కొవిషీల్డ్, వాక్స్‌జెవ్రియా బ్రాండ్ పేర్లతో ఇతర దేశాల్లో విక్రయించారు. ఇది COVID-19 నివారణకు వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దవారిలో కొవిడ్-19ని నిరోధించడానికి ఇన్‌ఫెక్షన్ నుండి రక్షణను అందించడానికి ఉపయోగించబడుతుంది. ఈ ఔషధాన్ని డెల్టాయిడ్ కండరం (పై చేయి) లోకి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ద్వారా రెండు 0.5 ml మోతాదుల ద్వారా శరీరంలోకి చొప్పిస్తారు. 2020 డిసెంబర్ 30న, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని బ్రిటన్ టీకా కార్యక్రమంలో ఉపయోగం కోసం మొదట ఆమోదించారు. ట్రయల్ వెలుపల మొదటి టీకాను 2021 జనవరి 4న నిర్వహించారు. అప్పటి నుండి టీకా వేయడం మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా 2022 జనవరి నాటికి, ప్రపంచ వ్యాప్తంగా 170 కంటే ఎక్కువ దేశాలకు 2.5 బిలియన్ల (250 కోట్లు) కంటే ఎక్కువ మోతాదుల వ్యాక్సిన్ విడుదల చేయబడింది.

టీకా వేసినా కరోనా

సాధారణంగా, వ్యాక్సిన్ తయారీ పరిశోధనకు సాధారణంగా 13 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ 6 నెలల్లో కరోనాకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఏ విధంగా తయారు చేశారు అనేది ప్రశ్న. ఎంతవరకు సేఫ్టీ, ఎఫికెసి వున్నాయి అనేది ప్రశ్నే? కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కొందరికి మళ్ళీ కరోనా వచ్చింది. టీకా వేశాక యువకులలో చాలా అరుదైన దుష్ప్రభావాలపై ఆందోళనల కారణంగా కొన్ని దేశాలు తీవ్రమైన COVID-19 వ్యాక్సిన్‌ని అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్న వృద్ధులకు మాత్రమే దాని వినియోగాన్ని పరిమితం చేశాయి. యూకె మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ 2021 ఏప్రిల్ 14 నాటికి దుష్ప్రభావాలకు సంబంధించి దాదాపు 21.2 మిలియన్ల వ్యాక్సిన్‌‌‌లలో 268 నివేదికలను కలిగి ఉంది. చాలా అరుదైన సందర్భాల్లో ప్లేట్లెట్స్ పడిపోవడం, ఎంబాలిక్, థ్రోంబోటిక్ సంఘటనలు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ప్రకారం, 2021 ఏప్రిల్ 14 నాటికి, యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో టీకాలు వేసిన 34 మిలియన్ల మందిలో మొత్తం 222 అత్యంత అరుదైన రక్తం గడ్డకట్టడం కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సిన్‌ని నిలిపివేసిన దేశాలు

కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లో ప్రాణాంతక దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయని తెలిశాక, ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా టీకాలు వేయడం నిలిపివేశాయి. 2021లోనే దక్షిణాఫ్రికా, కెనడా, మలేషియా, నార్వే, డేనిష్, ఆస్ట్రియా తదితర దేశాలు ఈ వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేశాయి. తమ తమ దేశాల్లోని ప్రధాన స్రవంతి టీకా కార్యక్రమం నుంచి కొవిషీల్డ్‌ని తొలగించాయి. కొన్నిదేశాలయితే శాశ్వతంగా నిషేధించాయి.

బ్రిటన్ హైకోర్టులో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై 51 కేసులు దాఖలయ్యాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై జామీ స్కాట్ అనే వ్యక్తి మొదటి కేసును వేశాడు. 2021 ఏప్రిల్‌లో తాను వ్యాక్సిన్ తీసుకొన్నాక , దాని వల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని అతడు ఆరోపించారు. టీకా వల్ల తాను లేవలేని పరిస్థితికి చేరుకున్నానని, తాను చనిపోతానని వైద్యులు చెప్పారని పేర్కొన్నాడు. బ్రిటన్ హైకోర్టులో ఆస్ట్రాజనకానెకా వ్యాక్సిన్‌ మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని ఆరోపిస్తూ అనేక సందర్భాల్లో దాదాపు 51 కేసులు దాఖలయ్యాయి.

క్లినికల్ ట్రయల్స్ ఏవి?

డ్రగ్ డిస్కవరీ ప్రక్రియ(కొత్త వ్యాక్సిన్ ను కనిపెట్టడం చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, దీనికి గరిష్టంగా 13 సంవత్సరాలు పట్టవచ్చు. సాధారణంగా, ప్రతి 5,000 ఔషధాలలో 1 మాత్రమే మార్కెట్ ఆమోదం దశకు చేరుకుంటుంది. 1) ప్రీ క్లినికల్ దశలో జంతువుల మీద ప్రయోగాలు జరుగుతాయి. 2) క్లినికల్ ట్రయల్స్ దశలో మనుషుల మీద ప్రయోగాలు జరుగుతాయి. నిజానికి క్లినికల్ ట్రయల్స్ నాలుగు దశలలో జరుగుతాయి:

ఫేజ్ I ట్రయల్స్ ... సాధారణంగా 30-80 ఆరోగ్యకరమైన వాలంటీర్లలో, సేఫ్టీ మరియు డోసేజ్ మోతాదును నిర్ణయిస్తాయి.

ఫేజ్ II ట్రయల్స్ ... 100-300 ఆరోగ్యకరమైన వాలంటీర్లలో వ్యాక్సిన్ సమర్థతను పరీక్షిస్తారు

ఫేజ్ III ట్రయల్స్ .. పెద్దవి,5000-10000 వాలంటీర్లలో వ్యాక్సిన్ సమర్థతను పరీక్షిస్తారు లక్షిత వ్యాధి ఉన్న రోగులలో తగినంత పెద్ద సంఖ్యలో భద్రత మరియు సమర్థతను నిర్ణయించడానికి కీలకమైన ట్రయల్స్. భద్రత, సమర్థత తగినంతగా నిరూపించబడినట్లయితే, క్లినికల్ టెస్టింగ్ ఈ దశలో ఆగిపోవచ్చు. ఇది కొత్త డ్రగ్ అప్లికేషన్ దశకు చేరుకుంటుంది.

ఫేజ్ IV ట్రయల్స్ ... పోస్ట్-అప్రూవల్ ట్రయల్స్, వీటిని మార్కెట్ అనంతర నిఘా అధ్యయనాలు అని కూడా పిలుస్తారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చాక పేషంట్స్ లో వచ్చే దుష్పరిణామాలు గురించి తెలుపుతుంది.

కానీ ఇవేవి లేకుండానే.. భారత మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు 80 కోట్ల మంది వినియోగించిన ఈ వ్యాక్సిన్‌పై ఇలాంటి వార్తలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే దేశంలోని పది లక్షల మంది టీకా వేయించుకుంటే వారిలో కేవలం ఏడుగురికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, పైగా సైడ్ ఎఫెక్ట్ మొదటి డోస్ తీసుకున్న వారం రోజుల లోపే ఉంటుందని.. కానీ మనదేశంలో దాదాపు అందరూ రెండు మూడు డోసులు తీసుకున్నారని వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని మాజీ సైంటిస్టుల ప్రకటనలు కాస్తా ఉపశమనాన్ని ఇస్తున్నాయి.

- ఏ సంజయ్ రెడ్డి

తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్

73868 63999

Tags:    

Similar News