బెంగాల్‌లో పాలకులు ఈ పనిచెయ్యకపోతే చరిత్ర క్షమించదు!
వక్ఫ్ బోర్డు నియమాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టాన్ని వ్యతిరేకి స్తూ, పశ్చిమ బెంగాల్

Violence in Murshidabadవక్ఫ్ బోర్డు నియమాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టాన్ని వ్యతిరేకి స్తూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం మత వర్గం చెలరేగిపోయి, హిందు వుల ఇళ్లను, దుకాణాలను తగలబెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే చర్యలకు పూనుకోవడంతో హిందువులు భయభ్రాంతులై, సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నా మమతా బెనర్జీ ప్రభుత్వం మిన్నకుండిపోవడంతో రాష్ట్ర హైకోర్టు ఆర్డర్‌తో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం బీ.ఎస్.ఎఫ్ దళాలు రంగ ప్రవేశం చేశాయి.
ఈ మొత్తం పరిస్థితికి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్‌పై ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టిన లౌకికవాద ముసుగు వేసుకున్న రాజకీయ నాయకులూ, లౌకిక మీడియా ప్రతినిధులను దోషులుగా నిలబెట్టాల్సిందే! ముస్లింల ఆస్తులు గుంజుకోవడానికి ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని, కొందరు రాజకీయ నాయకులు మీడియాలో ప్రకటనలు గుప్పించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఈ దేశంలో ముస్లింల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో లౌకికవాద మేధావి వర్గం విరుచుకుపడింది.
అక్రమ వలసదారుల హవా..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంది. ముర్షిదాబాద్, మాల్డా, దక్షిణ దినాజ్పూర్, ఉత్తర దినాజ్పూర్ , నదియా, ఉత్తర, దక్షిణ 24 పరగణ జిల్లాల్లో ముస్లింలు ఆడిందే ఆట. పాడిందే పాట. ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఉన్నా, టీఎంసీ ఉన్నా ఇస్లాం సమాజం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే! పోలీసు ఉన్నతాధికారుల ఆర్డర్లు అక్కడ పని చేయవు. పోలీసు శాఖలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) (మన రాష్ట్రంలో సీఐ స్థాయి అధికారి) టీఎంసీ బ్లాక్ లీడర్ చెప్పినట్లు బుద్ధిగా నడుచుకోవాల్సిందే. ఆ జిల్లాల్లో నివసించే ముస్లింలలో ఎవరు భారతీయ ముస్లిమో, ఎవరు బాంగ్లాదేశ్ ముస్లిమో, ఎవరు రోహింగ్యా ముస్లిమో నిర్ణయించడం కష్టం. అక్రమ వలసదారులకు ఆ రాష్ట్రం స్వర్గధామం. ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్, కమ్యూనిస్టు ,టీఎంసీ నాయకుల ఆలోచన ధోరణి అని చెబితే సత్య దూరం కాదేమో? అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు ఇప్పించి, ఓటర్లుగా నమోదు చేయించడానికి ఈ మూడు పార్టీల నాయకులు సర్వశక్తులు వొడ్డారు. ఇప్పుడు వారి నుండే ఆ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుంది.
సిరియా, పాలస్తీనా లాంటి పరిస్థితులు..
ఆ రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెందిన 72 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీల మాట ఎక్కడా చెల్లుబాటు కాదు. ఏ పోలీసు అధికారీ వీరి మాటలను లెక్కలోకి తీసుకోడు. ఆ రాష్ట్రం ఒక నివురు గప్పిన నిప్పులా ఉంది. ఆ రాష్ట్రంలోని హిందువులు సహనాన్ని పక్కనపెట్టి, 'మైనారిటీలైన ప్రజలు మెజారిటీ లైన మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటి? ఇందుకు కారణం కుహనా లౌకిక వాద రాజకీయ నాయకులు కారణం అని ఆలోచించి 'ప్రతిఘటనా చర్యలకు పూనుకుంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పనిచేయకుండా పోతుంది. సిరియా, పాలస్తీనా లాంటి పరిస్థితులు అక్కడ కూడా చోటు చేసుకుంటాయి. 1946లో ముస్లిం లీగ్ ఇచ్చిన ప్రత్యక్ష చర్య నరమేధం దాఖలాలు అక్కడి హిందువులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
దీదీని టచ్ చేస్తే ప్రమాదమే!
హిందువుల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కరువైన పరిస్థితుల్లో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, ఆ రాష్ట్రంలో ఎక్కువగా హిందువులు హెరాస్మెంట్‌కు గురై, బాగా నష్టపోతే అప్పుడు దేశవ్యాప్తంగా హిందువుల ఓటు బ్యాంకు బీజేపీకి కలిసొస్తుందని హార్డ్ కోర్ హిందువులు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టి, సంఘవిద్రోహ శక్తులను, హిందువులను ఇబ్బంది పెట్టే దుష్టశక్తులను నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలని వీరి నిరసనలోని ఆంతర్యం. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం మాత్రం పశ్చిమ బెంగాల్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందని, అక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టి, మమతా బెనర్జీకి రాజకీయంగా బలాన్ని తెచ్చే పరిస్థితిని బీజేపీ నాయకత్వం కలిగించదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
అరాచకాలకు పరిష్కారం ఓటు
ఆ రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా అధీర్ రంజన్ చౌదరి లాంటి వారూ, అనేకమంది కమ్యూనిస్టు నాయకులు మమతా బెనర్జీ ప్రభుత్వ చర్యల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం మార్చుకొని, వచ్చే సంవత్సరం జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలనే వ్యూహంతో కేంద్ర బీజేపీ నాయకత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దృష్టితోనే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. కానీ రాజకీయ పరిస్థితులను పక్కనపెట్టి, అక్కడ సామాన్య హిందువుల ధన, మాన, ప్రాణాలకు ఆస్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చరిత్ర ఈ పాలకులను క్షమించదు.
- ఉల్లి బాలరంగయ్య
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877