ఓటర్ల విజ్ఞతకు జోహార్లు

Congratulations to Telangana voters for their wisdom

Update: 2023-12-04 00:15 GMT

తెలంగాణ ఓటరు మహాశయులు చాలా గొప్ప వాళ్ళు. ఎలాంటి ప్రలోభాలకు లొంగని వాళ్లు. అవినీతి అక్రమాల ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, ఆయన పార్టీని మట్టి కరిపించి ఓడించారు. మీ విజ్ఞతకు జోహార్లు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. కుటుంబ పాలనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్‌ని 10 సంవత్సరాలు భరించారు తెలంగాణ ప్రజలు. ఈ విజయం ప్రజల విజయం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం. నిరుద్యోగుల విజయం. రైతుల విజయం. కార్మికుల విజయం. కూలీ సోదరుల విజయం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పట్టుదలతో ఎన్నికలను సవాలుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడపడం ఒక ఎత్తైతే, ఏఐసీసీ అధిష్టానం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలని చుట్టుముట్టి కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తూ.. ఎదిరిస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేశారు.

ప్రగతి భవనం కేసీఆర్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. తెలంగాణ ప్రజలను తన పాటలతో ఎరుపు ఎక్కించి ప్రజలను చైతన్యవంతులను చేసి చనిపోయిన గద్దర్ అన్న పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. ఏపూరి సోమన్న కేసీఆర్ మీద నిప్పులు కక్కుతూ పాడిన పాటలు. తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేశాయి. తర్వాతి కాలంలో అతను కేసీఆర్ పక్షాన పోయినా సరే... ఆయన పాటలు, అందించిన సాహిత్యం చాలా గొప్పగా తెలంగాణ ప్రజలను ఆలోచింపజేసి కేసీఆర్ పైన కసి పెంచుకోవడానికి ఏపూరి సోమన్న కూడా కారకుడయ్యారు. దాంతో పాటు ఆంధ్ర, హైదరాబాద్ ఓటర్లు పోలింగ్ బూత్‌కు పోకుండా మానివేశారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు. ఏది ఏమైనప్పటికీ.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాయమాటలకు మోసపోలేదు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ కేసీఆర్ చెప్పే తుపాకి రాముడు లాంటి మాటలని ఓటర్లు ఈసారి నమ్మలేదు. ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో కసి పెంచుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. శభాష్ తెలంగాణ ప్రజలారా. మీ విజ్ఞతకు జోహార్లు.

- ఆర్.కరుణాకర్,

హైకోర్టు న్యాయవాది.

96765 69841

Tags:    

Similar News