ఫ్లాష్.. ఫ్లాష్.. రానా, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సినీ ప్రముఖులు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రముఖ నటులు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, సీనియర్ నటుడు తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా, టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసుతో […]
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సినీ ప్రముఖులు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రముఖ నటులు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, సీనియర్ నటుడు తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా, టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసుతో వెలుగులోకి వచ్చాయి. హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ.. పోలీసులు ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్‌తో పాటు పలువురు ప్రముఖులను స్పెషల్ సెల్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను సైతం పోలీసులు సేకరించి పరీక్షలకు పంపించారు.