అనిల్ దేశ్‌ముఖ్ ఆస్తులు అటాచ్
ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు చెందిన స్థిరాస్తులను ఎన్ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. ఆస్తుల విలువ రూ.4.2కోట్లు. ఈ ఆస్తుల్లో అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఉన్నాయి. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో వివిధ బార్ల నుంచి మొత్తం రూ.4.7కోట్లు దండుకున్నారని ఈడీ వెల్లడించింది. ఈ మొత్తాన్నీ డిస్మిస్ అయిన ముంబయి పోలీస్ అధికారి, ‘అంబానీ ఇంటి ముందు కారు బాంబు’ కేసులో నిందితుడిగా […]
ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు చెందిన స్థిరాస్తులను ఎన్ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. ఆస్తుల విలువ రూ.4.2కోట్లు. ఈ ఆస్తుల్లో అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఉన్నాయి. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో వివిధ బార్ల నుంచి మొత్తం రూ.4.7కోట్లు దండుకున్నారని ఈడీ వెల్లడించింది. ఈ మొత్తాన్నీ డిస్మిస్ అయిన ముంబయి పోలీస్ అధికారి, ‘అంబానీ ఇంటి ముందు కారు బాంబు’ కేసులో నిందితుడిగా ఉన్న సచిన్ వాజే ద్వారా వసూలు చేయించారని తెలిపింది.