మేము ఏం చేయలేం.. మీరే ఆడుకోండి.. బీసీసీఐకి తేల్చిచెప్పిన ఈసీబీ
దిశ, స్పోర్ట్స్: కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు స్థానిక జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడాలని భావించిన టీమ్ ఇండియాకు నిరాశే మిగిలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ పరాభవం తర్వాత తమ జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడటానికి అనుమతి ఇవ్వాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును బీసీసీఐ కార్యదర్శి జై షా కోరారు. అయితే తాము ఎలాంటి వార్మప్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేమని.. షెడ్యూల్ ప్రకారం డుర్హమ్‌లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుకోవాలని ఈసీబీ తేల్చి చెప్పింది. దీంతో […]
దిశ, స్పోర్ట్స్: కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు స్థానిక జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడాలని భావించిన టీమ్ ఇండియాకు నిరాశే మిగిలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ పరాభవం తర్వాత తమ జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడటానికి అనుమతి ఇవ్వాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును బీసీసీఐ కార్యదర్శి జై షా కోరారు. అయితే తాము ఎలాంటి వార్మప్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేమని.. షెడ్యూల్ ప్రకారం డుర్హమ్‌లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుకోవాలని ఈసీబీ తేల్చి చెప్పింది. దీంతో జులై 15 నుంచి డుర్హమ్‌లో నాలుగు రోజు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు యధావిధిగా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘మాకు బీసీసీఐ నుంచి వార్మప్ మ్యాచ్‌ల కోసం రిక్వెస్ట్ అందింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేమని చెప్పాము. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుకోవాలని సూచించాము.’ అని ఈసీబీ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.