ఉప ఎన్నిక ఫలితాలపై ఈసీ కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం వరకు తేలిపోనున్నాయి. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌటింగ్ బూత్‌ల వద్ద భారీగా బందోబస్తును పెంచింది. ప్రధాన పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకుని ప్రచారం చేయగా.. గెలుపు మాత్రం ఒక్కరినే వరించనుంది. ఈక్రమంలో ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. గెలిచిన పార్టీలు […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం వరకు తేలిపోనున్నాయి. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌటింగ్ బూత్‌ల వద్ద భారీగా బందోబస్తును పెంచింది.
ప్రధాన పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకుని ప్రచారం చేయగా.. గెలుపు మాత్రం ఒక్కరినే వరించనుంది. ఈక్రమంలో ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. గెలిచిన పార్టీలు విజయోత్సవ ర్యాలీ తీసేందుకు అనుమతి లేదంటూ ఈసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నందున గెలిచిన అభ్యర్థితో ఇద్దరు మాత్రమే ఉండాలని పేర్కొంది. ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని ఈసీ అన్ని పార్టీలకు సూచించింది.