చిల్లర రాజకీయాలు చేస్తూ.. నీచ సంస్కృతికి దిగజారిన TRS.. ఈటల ఫైర్

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలపై ప్రభుత్వం ఎదురు దాడులు చేస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హుజురాబాద్ నియోజక వర్గ పరిధిలోని వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఫంక్షన్ హాల్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈటల రాజేందర్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా […]

Update: 2021-07-17 04:55 GMT

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలపై ప్రభుత్వం ఎదురు దాడులు చేస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హుజురాబాద్ నియోజక వర్గ పరిధిలోని వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఫంక్షన్ హాల్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈటల రాజేందర్ మాట్లాడారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా వాడుకునే నీచ సంస్కృతికి దిగజారిందని, బలహీనులు కాబట్టే చిల్లర రాజకీయాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారని ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17 శాతంగా ఉందని.. కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలకు ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారని, 0.5 శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ శాతం ఉన్నారని చెప్పుకొచ్చారు.

తాను అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకున్నానని, ఉద్యమ సమయంలో సైతం శక్తివంచన లేకుండా పని చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోలేరని పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలను పాటించే పార్టీ బీజేపీ అని, బీజేపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని అందులో భాగంగానే 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో నరేంద్ర మోడీ అవకాశాన్ని కల్పించారని వివరించారు. అంతకుముందు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Tags:    

Similar News