కురిళ్ ద్వీపాల సమీపంలో భూకంపం
పసిఫిక్ మహాసముద్రంలోని కురిళ్ ద్వీపాల సమీపంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 నమోదు అయిందని.. అమెరికా నేషనల్ ఓషియానిక్, అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భూకంప కేంద్రం కురిళ్‌లోని సెవెరో పట్టణానికి ఆగ్నేయ దిశలో 218 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. దీని కారణంగా విధ్వంసకరమైన సునామీ ఏర్పడవచ్చని, అది హవాయ్, మిడ్‌వే, ఉత్తర మెరియనాస్, వేక్ […]
పసిఫిక్ మహాసముద్రంలోని కురిళ్ ద్వీపాల సమీపంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 నమోదు అయిందని.. అమెరికా నేషనల్ ఓషియానిక్, అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భూకంప కేంద్రం కురిళ్‌లోని సెవెరో పట్టణానికి ఆగ్నేయ దిశలో 218 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. దీని కారణంగా విధ్వంసకరమైన సునామీ ఏర్పడవచ్చని, అది హవాయ్, మిడ్‌వే, ఉత్తర మెరియనాస్, వేక్ దీవులకు తీవ్ర నష్టం కలిగించవచ్చని హెచ్చరించింది. దీనికారణంగా జపాన్, రష్కా తీరాలకు కూడా నష్టం కలుగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, జపాన్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం పెద్ద ప్రమాదము జరగదని తెలిపింది.
tag: Earthquake, Kuril Islands, Pacific Ocean