వచ్చే నెలలో బౌన్స్ తొలి ఈ-స్కూటర్ విడుదల!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్ స్టార్టప్ బౌన్స్ తన మొదటి ఈ-స్కూటర్ ‘ఇన్ఫినిటీ’ని డిసెంబర్‌లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు అదేరోజు నుంచి ఈ-స్కూటర్లను బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. కేవలం రూ. 499 చెల్లించి ‘మేక్ ఇన్ ఇండియా’ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. డెలివరీలను 2022 ప్రారంభంలో అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం ఇప్పటికే 22మోటార్స్‌ను తయారీ యూనిట్‌తో సహా రూ. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్ స్టార్టప్ బౌన్స్ తన మొదటి ఈ-స్కూటర్ ‘ఇన్ఫినిటీ’ని డిసెంబర్‌లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు అదేరోజు నుంచి ఈ-స్కూటర్లను బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. కేవలం రూ. 499 చెల్లించి ‘మేక్ ఇన్ ఇండియా’ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. డెలివరీలను 2022 ప్రారంభంలో అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం ఇప్పటికే 22మోటార్స్‌ను తయారీ యూనిట్‌తో సహా రూ. 52 కోట్లకు కొనుగోలు చేసింది.
దేశీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారత్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే కంపెనీ ఈ-స్కూటర్ తయారీతో పాటు రాబోయే 12 నెలల్లో బ్యాటరీ ఎక్స్‌ఛేంజ్ మౌలిక సదుపాయాల కోసం రూ. 740 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే నెలలో విడుదల చేయనున్న బౌన్స్ ఇన్ఫినిటీ స్మార్ట్, రిమూవబుల్ లి-అయాన్ బ్యాటరీతో, సౌకర్యవంతమైన ఛార్జింగ్ సదుపాయాలతో లభించనుంది. 22మోటార్స్‌తో ఒప్పందంలో భాగంగా బౌన్స్ కంపెనీ రాజస్థాన్‌లోని తయారీ ప్లాంట్ నుంచి ఏడాదికి 1,80,000 స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని చేపట్టనున్నట్టు కంపెనీ వెల్లడించింది.