పదోన్నతులు కల్పించాలని సీఎస్‌కు వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్పెషల్గ్రేడ్డిప్యూటీ కలెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అర్హులైన డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కోరింది. మంగళవారం అధ్యక్షుడు కె.చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి ఎ.భాస్కర్‌రావు, ప్రతినిధి కె.చంద్రకళ వినతి పత్రం సమర్పించారు. ఆర్వోఆర్ చట్టాన్ని, ధరణి వెబ్సైట్, భూ రికార్డుల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా, రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్ల విధానం ద్వారా […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్పెషల్గ్రేడ్డిప్యూటీ కలెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అర్హులైన డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కోరింది. మంగళవారం అధ్యక్షుడు కె.చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి ఎ.భాస్కర్‌రావు, ప్రతినిధి కె.చంద్రకళ వినతి పత్రం సమర్పించారు. ఆర్వోఆర్ చట్టాన్ని, ధరణి వెబ్సైట్, భూ రికార్డుల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా, రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్ల విధానం ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. ఈ చారిత్రక నిర్ణయాన్ని తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తమ సంఘం తీర్మానించిన కోరికలను మానవత్వదృక్పథంతో పరిష్కరించాలని కోరారు.
సంఘం డిమాండ్లు
– వెయిటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్గ్రేడ్డిప్యూటీ కలెక్టర్లకు తగిన పోస్టింగులు ఇవ్వాలి.
– అడహక్పీరియడ్ను కూడా సర్వీసు పరిగణనలోకి తీసుకోవాలి.
– కమర్షియల్ట్యాక్సుల శాఖలోని అదనపు కమిషనర్ల పేస్కేలును స్పెషల్గ్రేడ్డిప్యూటీ కలెక్టర్లకు వర్తింపజేయాలి.
– ఆర్డీఓలకు, అదనపు కలెక్టర్లకు రెసిడెన్షియల్క్వార్టర్లు నిర్మించాలి.
– డిప్యూటీ కలెక్టర్లకు రొటేషన్ పద్ధతిలో ఆర్డీఓలుగా పని చేసే అవకాశాన్ని కల్పించాలి.