క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్ బ్రావో
దిశ, వెబ్‌డెస్క్ : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీ అనంతరం తాను రిటైర్ అవనున్నట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు. అయితే.. విండీస్ నెగ్గిన మూడు ఐసీసీ ట్రోఫీల్లో బ్రావో కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2012, 2016లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్లలో బ్రావో ప్లేయర్‌గా ఉన్నాడు. బ్రావో 2006లో ఆక్లాండ్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్ : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీ అనంతరం తాను రిటైర్ అవనున్నట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు. అయితే.. విండీస్ నెగ్గిన మూడు ఐసీసీ ట్రోఫీల్లో బ్రావో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
2012, 2016లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్లలో బ్రావో ప్లేయర్‌గా ఉన్నాడు. బ్రావో 2006లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం చేశాడు. 22.23 సగటు, 115.38 స్ట్రయిక్ రేట్‌తో 1,245 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల బ్రావో 78 వికెట్లు పడగొట్టాడు.