నడిరోడ్డుపై మురుగునీటి కంపు.. పట్టించుకునే నాథుడెవరు..?

దిశ, ఉప్పల్: కాప్రా సర్కిల్‌లోని కుషాయిగూడ జీనియా ఆసుపత్రి సమీపంలో గత కొన్ని రోజులుగా మురుగునీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తున్నది. అయినప్పటికీ.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మురుగునీటితో పాదాచారులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా మ్యాన్ హోల్ పై కప్పు పగిలిపోవడంతో చెత్తా చెదారం నిండిపోయింది. పరిశ్రమలకు సంబంధించిన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు స్థలాలను అద్దెకు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పెరిగిందని.. […]

Update: 2021-09-08 08:48 GMT

దిశ, ఉప్పల్: కాప్రా సర్కిల్‌లోని కుషాయిగూడ జీనియా ఆసుపత్రి సమీపంలో గత కొన్ని రోజులుగా మురుగునీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తున్నది. అయినప్పటికీ.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మురుగునీటితో పాదాచారులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా మ్యాన్ హోల్ పై కప్పు పగిలిపోవడంతో చెత్తా చెదారం నిండిపోయింది. పరిశ్రమలకు సంబంధించిన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు స్థలాలను అద్దెకు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పెరిగిందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి సమస్యలను పరిష్కరించి.. రోడ్డు మరమ్మత్తులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News