నిర్మల్‌లో వడగళ్ల వాన.. తడిసిన ధాన్యం
దిశ, ఆదిలాబాద్: నిర్మల్‌లో.. వర్షాలు, ఈదురుగాలులు రైతులను అతలాకుతలం చేశాయి. ఆదివారం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగళ్ల వాన కురవగా.. మరికొన్ని చోట్ల ఈదురుగాలులు వీచాయి. ఫలితంగా కల్లాల్లో అమ్మకానికి ఉంచిన మక్కలు, వడ్లు తడిసిపోయాయి. ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలాయి. జిల్లాలోని ముధోల్, భైంసా, బాసర, తానూర్ మండలాల్లో వడగళ్ల వర్షాలు కురిశాయి. వడగళ్ల కారణంగా ముఖ్యంగా ముధోల్ ప్రాంతంలో మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మక్కలు నింపిన సంచులు తడిసిపోయాయి. ధాన్యంపై కప్పిన […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్‌లో.. వర్షాలు, ఈదురుగాలులు రైతులను అతలాకుతలం చేశాయి. ఆదివారం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగళ్ల వాన కురవగా.. మరికొన్ని చోట్ల ఈదురుగాలులు వీచాయి. ఫలితంగా కల్లాల్లో అమ్మకానికి ఉంచిన మక్కలు, వడ్లు తడిసిపోయాయి. ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలాయి. జిల్లాలోని ముధోల్, భైంసా, బాసర, తానూర్ మండలాల్లో వడగళ్ల వర్షాలు కురిశాయి. వడగళ్ల కారణంగా ముఖ్యంగా ముధోల్ ప్రాంతంలో మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మక్కలు నింపిన సంచులు తడిసిపోయాయి. ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లూ నాశనమయ్యాయి. కాగా, సారంగపూర్, దిలావర్‌పూర్, నిర్మల్ లక్షణ చందా, మామడ మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. ఈ గాలులతో మామిడికాయలు రాలిపోయాయి.