కాంగ్రెస్ ఓట్లకంటే బీజేపీ ఆధిక్యమే ఎక్కువ

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఘోర పరాజయం పాలయింది. ఐదు రౌండ్లలో కలిసి కేవలం 2,724 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఓట్లకన్నా బీజేపీ అభ్యర్థికి వచ్చిన 3020 ఓట్లే అధికంగా ఉన్నాయి. ఐదు రౌండ్లో ఇప్పటి వరకు 35,996 ఓట్లను లెక్కించగా… కాంగ్రెస్‌కు 2,724 ఓట్లు వచ్చాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితం అయ్యారు. టీవీ యాంకర్ కత్తి కార్తీకకు 119 ఓట్లు […]

Update: 2020-11-10 00:31 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఘోర పరాజయం పాలయింది. ఐదు రౌండ్లలో కలిసి కేవలం 2,724 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఓట్లకన్నా బీజేపీ అభ్యర్థికి వచ్చిన 3020 ఓట్లే అధికంగా ఉన్నాయి. ఐదు రౌండ్లో ఇప్పటి వరకు 35,996 ఓట్లను లెక్కించగా… కాంగ్రెస్‌కు 2,724 ఓట్లు వచ్చాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితం అయ్యారు. టీవీ యాంకర్ కత్తి కార్తీకకు 119 ఓట్లు పోలయ్యాయి. ఆరో రౌండ్‌లో బీజేపీకి 20,226, టీఆర్ఎస్‌కు 17,559, కాంగ్రెస్‌కు3,254 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 2,667 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 45, 175 ఓట్లను లెక్కించారు. నోటాకు 160 ఓట్లు పడ్డాయి.

Tags:    

Similar News