ఇంట్లోనే ఖర్జురా బిస్కెట్లు తయారు చేసుకోండిలా..

కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం -100 గ్రాములు మైదా పిండి -200 గ్రాములు పంచదార పొడి -150 గ్రాములు బేకింగ్ పౌడర్ -1 టీస్పూన్ వెన్న -100 గ్రాములు కోడి గుడ్లు -2 తయారీ విధానం : ఎండు ఖర్జురాల గింజలను తీసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార పొడిలో వెన్న, కోడిగుడ్లను పగులగొట్టి వేయాలి. ఈ మిశ్రమాన్ని నురుగు వచ్చేంతవరకు చిలికి అందులో ఖర్జురపు పొడి, బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి చపాతి […]

Update: 2021-02-09 01:04 GMT

కావాల్సిన పదార్థాలు:

ఖర్జూరం -100 గ్రాములు
మైదా పిండి -200 గ్రాములు
పంచదార పొడి -150 గ్రాములు
బేకింగ్ పౌడర్ -1 టీస్పూన్
వెన్న -100 గ్రాములు
కోడి గుడ్లు -2

తయారీ విధానం :

ఎండు ఖర్జురాల గింజలను తీసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార పొడిలో వెన్న, కోడిగుడ్లను పగులగొట్టి వేయాలి. ఈ మిశ్రమాన్ని నురుగు వచ్చేంతవరకు చిలికి అందులో ఖర్జురపు పొడి, బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. దీనిని ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చపాతీలా చేసుకుని బిస్కెట్లుగా కోసుకుని బేక్ చేసుకుంటే ఖర్జురా బిస్కెట్లు రెడీ..

Tags:    

Similar News