తప్పతాగి యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి రిమాండ్

దిశ, క్రైమ్ బ్యూరో: రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేయడమే కాకుండా, ఆ సమయంలో డ్రింక్ చేసి, మరొకరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నార్సింగి పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..వెంకట నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ మంత్రి డెవలపర్స్ నుంచి తన నివాసమైన బుద్వేల్‌కు (TS 07 […]

Update: 2020-06-30 07:59 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేయడమే కాకుండా, ఆ సమయంలో డ్రింక్ చేసి, మరొకరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నార్సింగి పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..వెంకట నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ మంత్రి డెవలపర్స్ నుంచి తన నివాసమైన బుద్వేల్‌కు (TS 07 FU 0016(i20)కారులో బయలు దేరాదు. అదే సమయంలో ఒంగోలుకు చెందిన చల్లా శ్రీనివాస్ రావు నానక్ రామ్ గూడ నుంచి మై హోం అవతార్ వరకూ వన్ వే అయిన ఓఆర్ఆర్ పై మద్యం తాగి రాంగ్ రూట్ వస్తున్నాడు. ఓఆర్ఆర్ సర్వీస్‌లోని అపర్ణ ఎలిక్సర్ విల్లాస్ వద్ద ఎదురుగా వస్తున్న ఐ20 వాహనాన్ని రాంగ్ రూట్‌లో వెళ్లిన చల్లా శ్రీనివాస్ రావు తన బెంజ్ కారు (AP 39 CS 9999) తో ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో వెంకటనాగేశ్వరరావు ప్రాణాలు కోల్పొయాడు. పోలీసులు చల్లా శ్రీనివాస్ రావు‌ను వైద్య పరీక్షలకు పంపగా, రక్తంలోని ఆల్కహాల్ కంటెంట్ 30 మి.గ్రా/100 మి.లీ లకు బదులుగా 102 మి.లీ/100 మి.లీ ఉందన్నారు. దీంతో నిందితుడు చల్లా శ్రీనివాస రావుపై నార్సింగ్ పీఎస్‌లో అతివేగం, మద్యం సేవించి రాంగ్ రూట్ డ్రైవింగ్, రాత్రి పూట కర్ఫూ నిబంధనల ఉల్లంఘన మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కోసం ఆర్టీఏ కార్యాలయానికి లేఖ రాస్తామని రాచకొండ ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News