నిధుల్లేక.. రాయితీలు రాక.. !

దిశ, మేడ్చల్: జిల్లాలో బిందు, తుంపర సేద్యం.. గతేడాది వరకు రైతులకు వరమనే చెప్పాలి. ఈ విధానంలో తక్కువ నీటితో ఎక్కువ ఎకరాల్లో పంటలు పండించడంతో రైతులకు ఊహించని విధంగా ప్రయోజనాలు దక్కాయి. ప్రభుత్వం కూడా రాయితీలు ఇవ్వడంతో డ్రిప్ సిస్టమ్ ద్వారా పండ్ల తోటలు, కూరగాయాలు సాగు చేసుకొని మంచి లాభాలను పొందారు. ఎకరం వరిపంటకు సరిపోయే నీటితో ఐదెకరాల్లో ఆరు తడి పండలను సాగుచేసే అవకాశం ఉండటంతో రైతులు కూడా చాలా మంది ముందుకొచ్చారు. […]

Update: 2020-03-03 04:40 GMT

దిశ, మేడ్చల్: జిల్లాలో బిందు, తుంపర సేద్యం.. గతేడాది వరకు రైతులకు వరమనే చెప్పాలి. ఈ విధానంలో తక్కువ నీటితో ఎక్కువ ఎకరాల్లో పంటలు పండించడంతో రైతులకు ఊహించని విధంగా ప్రయోజనాలు దక్కాయి. ప్రభుత్వం కూడా రాయితీలు ఇవ్వడంతో డ్రిప్ సిస్టమ్ ద్వారా పండ్ల తోటలు, కూరగాయాలు సాగు చేసుకొని మంచి లాభాలను పొందారు. ఎకరం వరిపంటకు సరిపోయే నీటితో ఐదెకరాల్లో ఆరు తడి పండలను సాగుచేసే అవకాశం ఉండటంతో రైతులు కూడా చాలా మంది ముందుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏడాది నుంచి రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చూసుకున్నా ఇంతవరకు ఒక్క పైసా రాలేదు. నిధుల్లేకనే రాయితీలు ఇవ్వలేక పోతున్నామని అధికారులు చెబుతుండగా.. ఇప్పటికే సొంతంగా కూరగాయాలు, పండ్లతోటలు సాగు చేసుకుంటున్న రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టిసారించి రైతులను సూక్ష్మ సేద్యం వైపునకు మళ్లిస్తే పెట్టుబడులు తగ్గడమే కాకుండా నాలుగు పైసలు మిగులుతాయనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి.

నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుని తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు సూక్ష్మ సేద్యం చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకోసమే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు రైతులను ప్రోత్సహిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, మిగతావారికి 80 శాతం రాయితీలతో డ్రిప్ పరికరాలను అందజేస్తోంది. కూరగాయలు, పండ్ల తోటల సాగుకు బిందు సేద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాగు ఖర్చు సైతం తక్కువగా ఉంటుంది. కలుపు బెడద లేకపోవడంతో అంతర కృషి తక్కువ. ఎరువులు వేసుకునేందుకు కూలీలు సైతం పెద్దగా అవసరం ఉండదు.

ఎకరం వరి పంట నీటితో…
సూక్ష్మ సేద్యం పరికరాలతో ఒక ఎకరంలో వరి సాగు చేసేందుకు ఉపయోగించే నీటితో సుమారు ఐదెకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయడానికి అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నిరకాల ఉద్యాన పంటలు ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటల సాగులో సూక్ష్మ సేద్యం విధానం ఎంతో ఉత్తమం. మందుల పిచికారీ, రాత్రింబవళ్లు నీరు పెట్టే శ్రమ తప్పుతుంది. రెండున్నర ఎకరాల్లో బిందు సేద్యం పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూ.1లక్ష వరకు ఖర్చవుతుంది. అయితే గత ఏడాది నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో సూక్ష్మ సేద్యం వైపు మళ్లే రైతులు కూడా వెనుకడుగు వేస్తున్నారు.

Tags:    

Similar News