ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ‘డ్రీమ్ ఎలెవెన్’

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ సీజన్ 13 (IPL Season 13)కు స్పాన్సర్‌ (Sponsor)గా ప్రముఖ ఫాంటసీ లీగ్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ ఎలెవెన్’ (Dream11) ఎంపికైంది. ఇండో-చైనా (Indo-China) ఘర్షణల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్‌ (Title sponsor)గా వివో (Vivo) వైదొలగడంతో కొత్త స్పాన్సర్ (New sponsor) కోసం బీసీసీఐ (BCCI) టెండర్లు పిలిచింది. ఇందులో అత్యధిక ధర (Highest price)కు కోట్ చేసిన డ్రీమ్ ఎలెవెన్‌ (Dream11)కు స్పాన్సర్‌‌షిప్ హక్కులు (Sponsorship rights) కేటాయించింది. డ్రీమ్ ఎలెవెన్ […]

Update: 2020-08-18 07:27 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ సీజన్ 13 (IPL Season 13)కు స్పాన్సర్‌ (Sponsor)గా ప్రముఖ ఫాంటసీ లీగ్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ ఎలెవెన్’ (Dream11) ఎంపికైంది. ఇండో-చైనా (Indo-China) ఘర్షణల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్‌ (Title sponsor)గా వివో (Vivo) వైదొలగడంతో కొత్త స్పాన్సర్ (New sponsor) కోసం బీసీసీఐ (BCCI) టెండర్లు పిలిచింది.

ఇందులో అత్యధిక ధర (Highest price)కు కోట్ చేసిన డ్రీమ్ ఎలెవెన్‌ (Dream11)కు స్పాన్సర్‌‌షిప్ హక్కులు (Sponsorship rights) కేటాయించింది. డ్రీమ్ ఎలెవెన్ (Dream11) రూ.222 కోట్లకు ఈ హక్కులు దక్కించుకుంది. కాగా, గతంలో వివో (Vivo)ఏడాదికి రూ.440 కోట్లు ఇచ్చేది. అంటే గతంతో పోల్చుకుంటే రూ.218 కోట్ల తక్కువకే హక్కులు దక్కించుకున్న డ్రీమ్ ఎలెవన్‌ (Dream11)కు రాబోయే మూడేళ్ల పాటు ఒప్పందం కొనసాగుతుంది.

ఇప్పటికే బీసీసీఐ (BCCI)తో పలు భాగస్వామ్య ఒప్పందాలున్న ఈ సంస్థ, ఐపీఎల్‌ (Ipl)కు అసోసియేట్ పార్ట్‌నర్‌ (Associate Partner)గానూ వ్యవహరిస్తున్నది. ఇందుకు ఏటా రూ.40కోట్లు చెల్లిస్తున్నది. అయితే, అసోసియేట్ పార్ట్‌నర్‌ (Associate Partner)గా ఇకనుంచి కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఒక వేళ డ్రీమ్ ఎలెవెన్ అసోసియేట్ పార్ట్‌నర్‌ (Dream Eleven Associate Partner)గా వైదొలగితే, ఆ స్థానంలో మరొకరిని వెతకాల్సి ఉంటుంది. ఇక ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ (IPL title sponsor)రేసులో చాలా బహుళ జాతి కంపెనీలు (Multinational companies)పోటీ పడ్డాయి. అందరి కంటే రేసులో ముందున్నది టాటా గ్రూప్ (Tata Group). కాగా, డ్రీమ్ ఎలెవెన్ (Dream11) రూ.222 కోట్లకు బిడ్ వేయగా, అన్అకాడెమీ రూ.210 కోట్లు, టాటా గ్రూప్ రూ.180 కోట్లు, బైజూస్ రూ.120 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. దీంతో అందరి కంటే ఎక్కువ విలువైన బిడ్ వేసిన డ్రీమ్ ఎలెవెన్‌ను ఎంపిక చేశారు.

Tags:    

Similar News